గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (13:25 IST)

కరివేపాకును మెత్తగా రుబ్బుకుని మోచేతులకు రాసుకుంటే?

కరివేపాకు కూరలకు మంచి రుచిని ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకును వాడటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, శక్తి, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం పుష్కలంగా వుంటాయి.


కరివేపాకుతో డయేరియాను దూరం చేసుకోవచ్చు. కరివేపాకు క్యాన్సర్‌తో పోరాడుతుంది. బరువును తగ్గించేందుకు, జట్టు పెరిగేందుకు, కంటికి మేలు చేస్తాయి. అలాంటి కరివేపాకు అందానికి వన్నె తెస్తుందట.
 
ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక స్పూను కరివేపాకు ముద్దలో కొద్దిగా పసుపు కలిపి మోచేతులకు రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మోచేతుల దగ్గర నలుపు పోతుంది.
 
అదేవిధంగా ఒక స్పూన్ కరివేపాకు ముద్దలో ఒక స్పూను తులసి ఆకుల పొడి, కొద్దిగా పుదీనా ఆకుల పొడి, రెండు టీ స్పూన్ల రోజ్‌వాటర్ వేసి బాగా కలిపి చేతులకు, కాళ్లకు రాసుకుంటే చర్మం మృదువుగా అవుతుంది.
 
వేడినీళ్లలో కరివేపాకు ఆకులు వేసి పావుగంట తర్వాత ఆకుల్ని తీసేసి అందులో చల్లటినీళ్లు కలుపుకుని వాటితో ముఖాన్ని కడుక్కోవాలి. వర్షాకాలంలో ఇలా చేస్తే మంచిది. తరుచు ఇలా చేయడం వల్ల మొటిమల సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.