ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (17:02 IST)

స్త్రీపురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచే చెర్రీ పండ్లు

మధుమేహం అదుపులో వుండాలంటే.. చెర్రీ పండ్లు తినాల్సిందే.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులోని ఆంథోసయనిన్స్ అనే పోషకాలు.. క్లోమగ్రంథిలో ఇన

మధుమేహం అదుపులో వుండాలంటే.. చెర్రీ పండ్లు తినాల్సిందే.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులోని ఆంథోసయనిన్స్ అనే పోషకాలు.. క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తికి సహకరిస్తాయి. అందువల్ల చెర్రీ పండ్లను తింటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో వుంటాయి. తద్వారా మధుమేహం అదుపులో వుంటుంది. 
 
అలాగే ఫైబర్ పుష్కలంగా ఉండే చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది. చెర్రీస్‌లో వుండే లో కేలరీలు బరువును సులభం తగ్గిస్తాయి. ముఖ్యంగా పొట్టను కరిగిస్తుంది. విటమిన్ బి, థయామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ బీ6 జీవక్రియను మెరుగుపరుస్తుంది. 
 
ఇందులో నీటి శాతం ఎక్కువగా వుండటం ద్వారా శరీరంలో ఎనర్జీ స్థాయులు పెరుగుతాయి. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు. అలాగే చెర్రీ పండ్లు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇందులోని విటమిన్ ఎ, సీ, స్త్రీపురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. గుండె జబ్బులను దూరం చేస్తాయి.  మైగ్రేన్, వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు.