మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 30 మే 2019 (20:27 IST)

ఉపవాసంతో ఉపయోగాలు..

సాధారణంగా ఏదైనా పండుగ సమయాల్లో మనం ఏమీ తినకుండా ఉపవాసాలు ఉంటారు. కానీ, ఉపవాసాలు చేయడం వల్ల ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. వారానికి ఒకసారి చేసే ఉపవాసం వల్ల ఎన్నో రకాలైన ప్రయోజనాలు కలుగుతాయట. అలా చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ పెరుగుతుంది. 
 
ఒత్తిడి, వ్యాధులను తట్టుకుని, శక్తితో పాటు ఏకాగ్రత కూడా బాగా పెరిగి మెదడు పనితీరుని మరింత మెరుగ్గా మార్చుతుంది. వృద్ధాప్య ఛాయలు దూరమై యవ్వనంగా కనిపిస్తారు. ఒంట్లోని కొవ్వు తగ్గి హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఉపవాసం కారణంగా కణాలను దెబ్బతీసే స్ట్రెస్ తగ్గుతుంది. ఈ కారణంగా క్యాన్సర్ ముప్పు దూరమవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలు కూడా దూరమవుతాయి.