శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (15:04 IST)

అల్పాహారం ఇలా వుంటే.. ఆరోగ్యం భేష్..

ఉదయం పూట అల్పాహారం మహారాజులా చేయాలంటారు పెద్దలు. అప్పుడే ఒబిసిటీ ఇబ్బంది వుండదు. ఉదయం పూట కడుపు నిండా తినడం ద్వారా మధ్యాహ్నం పూట మితంగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇక రాత్రి పూట అంతగా ఆకలి వేయదు. ఇలా తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇంకా అల్పాహారంలో ఇవన్నీ వుంటే ఆరోగ్యంగా వుండగలుగుతారని వైద్యులు చెప్తున్నారు. 
 
అవేంటో చూద్దాం.. ఉదయాన్నే టిఫిన్‌లో భాగంగా రాగి జావ తీసుకోవడం ఉత్తమం. ఓట్స్ ఉప్మా, లేదా పాలల్లో ఓట్స్ వేసుకుని తీసుకోవచ్చు. లేదా పాలతో కార్న్‌ఫ్లేక్స్ తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అల్పాహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తప్పని సరిగా ఉండేలా చూసుకోండి. కోడిగుడ్డు అది కూడా ఉడికించిన కోడి గుడ్డు రోజుకు ఒకటి అల్పాహారంలో తీసుకోవాలి.
 
సోయాపాలు ఆరోగ్యానికి చాలా మంచివి. మనం తీసుకునే పాల స్థానంలో వారంలో రెండు మూడు రోజులైనా సోయా పాలు తీసుకోవాలి. వారంలో ఒక రోజయినా పూరీని అల్పాహారంగా తీసుకోండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు పూరీలు, వెజిటబుల్ కర్రీ మంచి ఆహారం. ఉదయం పుల్కాలు తినే వారు అందులోకి తాజా కూరగాయలతో పాటు చిరుధాన్యాలతో ఒక కూర చేసుకుంటే శరీరానికి తగిన శక్తి వస్తుందని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు.