సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (09:46 IST)

దాల్చిన చెక్క, తేనెతో బరువు మటాష్

దాల్చినచెక్క, తేనె మిశ్రమం శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిల్ని తగ్గిస్తాయి. దాల్చిన చెక్క టీని పిల్లలకు తాగించడం ద్వారా జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందుతారు. దాల్చిన చెక్క ఎక్కువగా ’యాంటీ-బాక్టీరియల్’ గుణా

దాల్చినచెక్క, తేనె మిశ్రమం శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిల్ని తగ్గిస్తాయి. దాల్చిన చెక్క టీని పిల్లలకు తాగించడం ద్వారా జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందుతారు.

దాల్చిన చెక్క ఎక్కువగా ’యాంటీ-బాక్టీరియల్’ గుణాలను కలిగి ఉన్నందున, రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. వ్యాధితో ఉన్నపుడు రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. 
 
దాల్చిన చెక్క, తేనెతో కలిపిన మిశ్రమాన్ని వాడటం వల్ల చర్మం పైన ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క మిశ్రమాన్ని, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలో పెరిగిపోయే కొవ్వును తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, ఖాళీ కడుపు అనగా అల్పాహారానికి ముందు, రాత్రి పడుకోటానికి ముందుగా ఈ మిశ్రమాన్ని తాగాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.