శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2019 (14:07 IST)

కొబ్బరిని రోజూ తీసుకుంటే.. థైరాయిడ్ మటాష్

కొబ్బరి నీళ్లతో పాటు కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరిని తరచుగా తింటుంటే థైరాయిడ్ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


కొబ్బరి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కిడ్నీ వ్యాధులు, బరువు తగ్గడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ప్రతిరోజూ కొబ్బరి తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన ప్రమాదకర ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. 
 
కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపేస్తుంది. కొబ్బరి నీళ్లు ఎసిడిటీ, గుండె మంటను తగ్గిస్తుంది. కొబ్బరి తీసుకోవడం వలన రక్తంలో ఆక్సిజన్ పాళ్లు పెరిగి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. 
 
జిడ్డు చర్మానికి కొబ్బరి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. చర్మంలోని అదనపు ఆయిల్స్‌ను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలో చుండ్రు, పేలు చేరడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.