కరివేపాకు పొడిని నెయ్యితో కలిపి వేడి వేడి అన్నంతో తీసుకుంటే..?
కరివేపాకు పొడిని నెయ్యితో కలిపి వేడి వేడి అన్నంతో తీసుకుంటే..? ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కరివేపాకుతో మిరియాలు, ఉప్పు, జీలకర్రను చేర్చి పొడి కొట్టుకుని నెయ్యి కలిపి తీసుకుంటే ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.
కరివేపాకుతో కాల్చిన చింతపండు, వేయించిన ఉప్పు, మిరపకాయలు చేర్చి తీసుకుంటే పేగు వ్యాధులను దూరం చేస్తుంది. పిత్తాన్ని హరించే గుణం కరివేపాకు ఉంది. చేతులు కాళ్ళు దడపుట్టడం. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. డయాబెటిస్ వ్యాధులను దూరం చేస్తుంది. గుండెపోటును, క్యాన్సర్‌ను నియంత్రిస్తుంది.
అధిక బరువును తగ్గించడంలోనూ కరివేపాకు ఎంతగానో మేలు చేస్తుంది. నిత్యం భోజనానికి ముందు కొన్ని కరివేపాలకు అలాగే నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వీటిలో ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జ్వరం, శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.