సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (22:25 IST)

పరగడుపున నేరేడు పండ్లు తినరాదు, ఎందుకంటే?

నల్లటి ద్రాక్షకాయల్లా వుండే నేరేడు కాయలు ఈ వర్షాకాలంలో స్పెషల్. ఈ నేరేడు కాయలు ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. అవేమిటో చూద్దాం.
 
1. నేరేడు చిగుళ్లు, మామిడి చిగుళ్లు తీసుకుని వాటితో కషాయం కాచి, దానిలో తేనె చేర్చి సేవిస్తే, పైత్యపు వాంతులు వెంటనే తగ్గిపోతాయి. 
 
2. కిడ్నీలో రాళ్లు వున్నవారు నేరేడు పండ్లు తింటే అవి కరిగిపోవడమే కాదు మరోసారి రాళ్లు ఏర్పడే అవకాశమే వుండదు.
 
3. ముఖ్యమైన గమనిక ఏమిటంటే... నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే జీర్ణాశయంలో సమస్య ఏర్పడి అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల ముందుగా ఏదో ఒకటి తిన్న తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలి. అలాగే ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా వైద్య సలహాలు తీసుకున్న తర్వాత వాటిని తినవచ్చు.
 
4. నేరేడు విత్తనాలు, పొడపత్రి కాచు, పసుపు, ఎండు ఉసిరిక కలిపి చూర్ణం చేసుకుని దాన్ని చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే మధుమేహం అదుపులో వుంటుంది.
 
5. నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు గట్టిపడతాయి. అలాగే నేరేడు చెక్క కషాయాన్ని పుక్కిలిపడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి.