కలలో నేరేడు పండు కనిపిస్తే ఏంటి ఫలితం? (video)
కలలు లేదా స్వప్నాలు ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి. ఐతే ఒక్కో కలకు ఒక్కో అర్థం వుంటుంది. కొందరికి పండ్లు, కాయలు కలలోకి వస్తుంటాయి. ఏ పండు కలలో కనబడితే ఎలాంటి ఫలితమో చూద్దాం.
1. నేరేడు పండు చెట్టు నుంచి రాలి క్రింద పడటం కలలో కనిపించిన సంతోష వార్తలు వింటారు. తిన్నట్లు కలవచ్చిన అనారోగ్యము కలుగును. చెట్టును చూసిన శుభవార్తలు వింటారు.
2. అరటిపండు కలలో చూసిన ప్రేమ వివాహం జరుగుతుంది. తిన్నట్లు కలవస్తే ధనలాభం, అరటిగెల కనిపించిన స్నేహితులు కొత్తగా పరిచయమయ్యెదరు. ఎవరి దగ్గరైనా మీరు తీసుకున్నట్లు కలవచ్చిన ఆపదలు కలుగును.
3. గుమ్మడి పండు కలలో పాదుకు వ్రేలాడుతున్నట్లు కలవచ్చిన మీకు ఆపదలు చుట్టుముట్టుగలవని గ్రహించవలయును. గుమ్మడికాయను తిన్నట్లు కలవచ్చిన ఆకస్మిక ధనలాభము కలుగును. గుమ్మడికాయను భుజముపై పెట్టుకున్నట్లు కలవచ్చిన అన్నిట్లోను విజయము సాధించగలరు.