తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, ఈసారి అమ్మాయిలదే పైచేయి

ఐవీఆర్| Last Modified గురువారం, 18 జూన్ 2020 (16:04 IST)
తెలంగాణలో మొదటి మరియు రెండవ సంవత్సరానికి టిఎస్ ఇంటర్ ఫలితాలు 2020ను స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిఎస్బిఐఇ) ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారికంగా ఫలితాలను విడుదల చేశారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 60.1 శాతం, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత 68.7 శాతం. ప్రతి సంవత్సరం మాదిరిగానే, బాలికలు మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో అబ్బాయిలను మించిపోయారు.

మొదటి సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం 67.4 కాగా, అబ్బాయిల ఉత్తీర్ణత 52.3 శాతం. రెండవ సంవత్సరంలో బాలికలలో ఉత్తీర్ణత శాతం 71. 5 శాతం, అబ్బాయిలది 62.1 శాతం.



దీనిపై మరింత చదవండి :