ganesh chaturthi

పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?

Written By జయ
Updated: శుక్రవారం, 10 జులై 2026 (23:24 IST)
చాలామందికి పన్నీర్ రకరకాల వంటల్లో కలిపి తినడం అంటే బాగా ఇష్టం. ఇక చపాతీల్లోకి అయితే పన్నీర్ కూరను చేసుకుని లాగించేస్తుంటారు. ఐతే ఈ పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎలాంటి పన్నీర్ తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పన్నీర్ శరీరానికి ఆరోగ్యకరమే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది అనారోగ్యానికి దారితీయవచ్చు.
 
పన్నీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పన్నీర్ అనేది ముఖ్యంగా శాకాహారులకు ఒక అద్భుతమైన పోషకాహారం. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో అధిక ప్రోటీన్ వుంది. ఫలితంగా కండరాల బలానికి, కణాల మరమ్మతుకు, శరీర ఎదుగుదలకు పన్నీర్‌లో ఉండే క్వాలిటీ ప్రోటీన్ బాగా ఉపయోగపడుతుంది. పన్నీర్ లోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు, పళ్ళు బలంగా ఉండటానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఆహారం, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచదు.
 
కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
పన్నీర్ తయారీకి ఉపయోగించే పాలను బట్టి దాని ప్రభావం ఉంటుంది. ఫుల్-క్రీమ్ మిల్క్ పన్నీర్.. అంటే వెన్న తీయని పాలుతో చేసిన పన్నీర్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీన్ని రోజూ లేదా ఎక్కువ మొత్తంలో తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగే అవకాశం ఉంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. లో-ఫ్యాట్ లేదా స్కిమ్డ్ మిల్క్ పన్నీర్.. అంటే వెన్న తీసిన పాలతో చేసే పన్నీర్‌లో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో సురక్షితం.
 
ఆరోగ్యంగా ఉండటానికి పన్నీర్ ఎలా తినాలి?
ఇప్పటికే హై కొలెస్ట్రాల్, బీపీ లేదా గుండె జబ్బులు ఉంటే, మార్కెట్లో దొరికే 'లో-ఫ్యాట్ పన్నీర్' లేదా ఇంట్లోనే టోన్డ్ మిల్క్‌తో చేసిన పన్నీర్‌ను వాడాలి. పన్నీర్‌ను నూనెలో డీప్ ఫ్రై (Deep Fry) చేయడం వల్ల క్యాలరీలు, కొవ్వులు విపరీతంగా పెరుగుతాయి. అలా కాకుండా లైట్‌గా గ్రిల్ చేయడం, బేక్ చేయడం లేదా తక్కువ నూనెతో కర్రీస్ చేసుకోవడం మంచిది. ఏదైనా పరిమితంగా తింటేనే ఆరోగ్యం. రోజువారీ ఆహారంలో 50 నుండి 60 గ్రాముల పన్నీర్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
About Author
జయ
Content provider.... Read More

అన్నీ చూడండి

విశాఖపట్నం సెంట్రల్ పార్క్ బయట కరెన్సీ నోట్లు

ప్రధాని మోడీ స్కూల్‌మేట్ భూవివాదం పరిష్కారం...

ఇంట్లో పేదరికం తాండవిస్తున్నా.. ఒకే ఇంట్లో ఐదుగురు డాక్టర్లు అయ్యారు.. ఎక్కడ?

డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్

అక్టోబరు 15 నుంచి యూపీఐ సేవలు భారం కానున్నాయా?

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments