ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (19:14 IST)

కరోనా-తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకుంటే?

తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకు ఒకటి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇంకా కరోనా కాలంలో వ్యాధినిరోధకతతో సురక్షితంగా వుండవచ్చునని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 
 
శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను తేనె అందిస్తుంది. అనేక ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ గుణాలు తేనెలో ఉండడం వల్ల అది శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచి, బలాన్ని ఇస్తుంది. 
 
అలాగే తేనెలో వారంరోజుల పాటు నానబెట్టిన ఎండు ఖర్జూరం పండ్లను తింటే ఎన్నో లాభాలు న్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఒక జార్‌లో 3వ వంతు తేనె తీసుకోవాలి. అందులో విత్తనాలను తీసిన ఎండు ఖర్జూరం పండ్లను వేయాలి. తర్వాత మూత బిగించి జార్‌ను బాగా షేక్‌ చేయాలి. 
 
అనంతరం ఆ జార్‌ను వారం పాటు అలాగే ఉంచాలి. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఆ జార్‌ను షేక్‌ చేయవచ్చు. వారం తరువాత జార్‌ను తీసి, రోజుకు ఒకటి రెండు చొప్పున ఆ ఖర్జూరపండ్లను తినాలి.
 
తేనె, ఎండు ఖర్జూరం మిశ్రమం తినడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాస సమస్యలు పోతాయి. జ్వరం తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రావు. 
dates
 
అలాగే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. నిద్రలేమితో బాధపడేవారు ఈ మిశ్రమం తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన మటాష్ అవుతుంది. గాయాలు త్వరగా మానిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.