మొక్కజొన్నతో రోజంతా శక్తి, ఎలాగో తెలుసా? (video)
మొక్కజొన్నలో విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో మొక్కజొన్నను జోడించడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది: అధిక ఫైబర్ లక్షణాలు కలిగి వున్న మొక్కజొన్న బరువు తగ్గడానికి అద్భుతమైన ధాన్యం. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది. మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.
రోజంతా శక్తి: చాలా మంది క్రీడాకారులు, ఫిట్నెస్ ఔత్సాహికులు వారి రోజువారీ ఆహారంలో మొక్కజొన్నను కలిగి ఉంటారు, ఎందుకంటే ఇది వారి శక్తి స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి మరియు రోజంతా శక్తిని అందిస్తాయి.
రక్తపోటు అదుపు: పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నందున, మొక్కజొన్న గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు రక్తపోటును అదుపులో వుంచడానికి సహాయపడుతుంది. మొక్కజొన్నలో అధిక ఫైబర్ ఉంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మొక్కజొన్నలో ఆంథోసైనిన్ వుండటం వల్ల మొక్కజొన్న ఇన్సులిన్ మరియు గ్లూకోజ్ స్థాయిల క్రమబద్ధీకరించి మధుమేహాన్ని నియంత్రించే గుణాన్ని కలిగి వుంటుంది. ఇవే కాక, విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున చర్మాన్ని కాపాడటానికి ఆహారంలో మొక్కజొన్న జోడించుకోవచ్చు.