శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 30 జులై 2018 (10:43 IST)

అవిసె గింజలతో కొలెస్ట్రాల్ చెక్...

అవిసె గింజలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ఈ గింజలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి1, కాపర్, మాంగనీస్, మెగ్నిషియం, పాస్పరస్, జింక్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా లభ

అవిసె గింజలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ఈ గింజలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి1, కాపర్, మాంగనీస్, మెగ్నిషియం, పాస్పరస్, జింక్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ అవిసె గింజలు పలు అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. మరి ఈ గింజలలో గల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
చేపలు తీనలేని వారి అవిసె గింజలను ఆహారంగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ గింజలలో పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఈ గింజల పొడిని గోధుమ, ఇడ్లీ, దోశ పిండిలలో కూడా కలుపుకుని వాడుకోవచ్చును. కొలెస్ట్రాల్‌ను తగ్గించుటలో మంచిది దోహదపడుతాయి. రక్తపోటును, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. 
 
ప్రతిరోజూ వీటిని ఉదయాన్నే తీసుకోవడం వలన అలసట తగ్గుతుంది. ఏ పని చేసిన ఉత్సాహంగా ఉంటారు. నీరసం ఉండదు. మహిళలు అవిసె గింజలు తీసుకోవడం వలన హార్మోన్స్ సరిగ్గా విడుదలవుతాయి. తద్వారా రుతుక్రమం సరిగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తిని పెంచుటలో చాలా ఉపయోగపడుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్యాన్సర్ వ్యాధులు దరిచేరవు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.