సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 13 డిశెంబరు 2023 (14:47 IST)

పచ్చి కొబ్బరి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Coconut delight
పచ్చి కొబ్బరి. ప‌చ్చి కొబ్బ‌రిలో కాప‌ర్‌, ఐర‌న్‌, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, పాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, సెలీనియం, జింక్, విట‌మిన్ బి1, బి5, బి9 త‌దిత‌ర విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. పచ్చి కొబ్బరి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి కొబ్బరిలోని పీచు పదార్థం జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.
 
పచ్చికొబ్బరితో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కనుక గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పచ్చి కొబ్బరిలో వుండే పోషకాలు థైరాయిడ్ సమస్యను రాకుండా అడ్డుకుంటాయి. మెదడు చురుగ్గా పనిచేసి మతిమరుపు సమస్య రాకుండా వుండాలంటే పచ్చికొబ్బరి తినాలి.
 
పిల్లలకి పచ్చికొబ్బరి, బెల్లంతో చేసిన పదార్థాలు తినిపిస్తే రక్తహీనత సమస్య రాదు. చిన్న వయసు నుంచే ఎముకలు, కండరాలు పటిష్టంగా వుండాలంటే పిల్లలకి పచ్చికొబ్బరి, బెల్లంతో చేసినవి పెట్టాలి.
 
చర్మం, కేశాలు ఆరోగ్యకరంగా వుండాలంటే పచ్చికొబ్బరిని ఆహారంలో భాగం చేసుకుంటూ వుండాలి. డ‌యాబెటిస్ ఉన్న‌వారు పచ్చి కొబ్బ‌రిని తింటే వారి ర‌క్తంలో ఉన్న షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి.