శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (22:24 IST)

దొండకాయ పచ్చడితో మధుమేహం పరార్..

Dondakaya pachadi
దొండకాయ మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో పేరుకుపోయే చక్కెర నిష్పత్తిని నియంత్రిస్తుంది. నోటిపూతకు దొండకాయ చెక్ పెడుతుంది. రోజూ కనీసం యాభై గ్రాముల దొండకాయను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు దొండకాయ ఆకు కషాయం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. కళ్లు చల్లబడతాయి. దొండకాయ ఆకుల కషాయం తాగడం వల్ల కంటి చికాకు పోతుంది.
 
ఐదు గ్రాముల కోకా ఆకుల రసం, మెంతిపొడి కలిపి మెత్తగా నూరి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చేయాలి. అల్సర్ ఉన్నవారికి దొండకాయ పచ్చడి ఉత్తమ ఔషధం.

పిత్తం, రక్తస్రావం, కడుపు ఉబ్బరం మరియు కడుపులోని నులిపురుగులకు దొండకాయ మంచి ఔషధం. ప్రధానంగా ఆహారంలో దొండకాయల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
దొండకాయలో ఉండే కాల్షియం ఆరోగ్యకరమైనది. మూత్రపిండాల్లో రాళ్లను నయం చేయడానికి బచ్చలికూర వంటి ఇతర కూరగాయలతో కలిపి ఉపయోగించవచ్చు.

దొండకాయలో పొటాషియం పుష్కలం. గుండెకు రక్త ప్రవాహాన్ని నియంత్రించడం, గుండె జబ్బులను నివారించడం ద్వారా గుండె యొక్క సరైన ఆరోగ్యానికి దొండకాయను తీసుకోవడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.