శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2019 (17:12 IST)

పాలకూర పనీర్ సూప్ ఎలా చేయాలో తెలుసా?

పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలక్, పనీర్ రెండింటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయి. వండిన పాలకూర నుంచి పాల ఉత్పత్తులతో సమానమైన క్యాల్షియం అందుతుంది. జుట్టు ఎదుగుదలకి పాలకూర దోహదం చేస్తుంది. అలాంటి కాంబోలో పాలకూర పనీర్ సూప్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
పాలకూర తురుము- రెండు కప్పులు, 
నూనె- చెంచా 
ఉల్లిపాయముక్కలు- అరకప్పు
పాలు- కప్పు
పనీర్ తురుము
సన్నగా తురిమిన వెల్లుల్లి పలుకులు- చెంచా
ఉప్పు- తగినంత
 
తయారీ విధానం:
స్టౌ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక.. కొద్దిగా వేసి వేడెక్కాక అందులో ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి పలుకులు వేసి రంగుమారేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు పాలకూర తురుము కూడా వేసి మరో రెండు నిమిషాలపాటు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అరకప్పు నీళ్లు వేసుకుని మధ్యమధ్యలో కలుపుతూ స్టౌ ఆఫ్ చేయాలి. 
 
చల్లారిన తర్వాత పాలకూరని మిక్సీజార్‌లో వేసుకుని మెత్తగా స్మూథీలా మార్చుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్‌ పాత్రలోకి తీసుకుని దీనికి పాలు, కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి వేసుకుని మరో రెండు నిమిషాలపాటు మరిగించుకోవాలి. ఇందులో నేతిలో దోరగా వేయించిన పనీర్ ముక్కలు చేర్చితే రుచికరమైన పాలకూర సూప్‌ రెడీ అయినట్లే.