శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 8 జులై 2020 (16:53 IST)

చికెన్ తింటే మంచి ఎంత? చెడు ఎంత? (Video)

362 గ్రాముల చికెన్ 65లో ఉండే క్యాలరీలు, కొవ్వులు చూసినప్పుడు... శరీరానికి అందే క్యాలరీలు 249. 8 గ్రాముల కొవ్వు అంటే రోజువారీలో 12 శాతం వచ్చేస్తుంది. కొలెస్ట్రాల్ 85 మిల్లీ గ్రాములు చేరుతుంది. రోజువారీ అందే కొలెస్ట్రాల్ లో దీని వాటా 28 శాతం. సోడియం 1208 మిల్లీ గ్రాములు చేరుతుంది. ఇది రోజువారీలో శరీరానికి అందే శాతంలో 50. 
 
పొటాషియం 87 మిల్లీ గ్రాములు, ఇది రోజువారీలో 2 శాతం. కార్బొహైడ్రేట్లు 10.3 గ్రాములు, ఇది రోజువారీలో 3 శాతం. ఫైబర్ 3.3 గ్రాములు, రోజువారీలో 13 శాతం వచ్చేస్తుంది. ఇలా చూసినప్పుడు చికెన్ 65 తీసుకోవడం ద్వారా విటమిన్ సి అత్యధికంగా అందుతుంది కానీ ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్, సోడియం చేరుతుంది. ఈ రెండూ గుండె ఆరోగ్యానికి మంచివి కావు. అందువల్ల చికెన్ 65 అనేది ఎప్పుడో ఒక్కసారి తినాలి తప్ప వారం కాగానే దాన్ని తింటూ ఉండకూడదు.
 
అంతేకాదు చికెన్ మూలవ్యాధితో బాదపడుతున్నవారు, ఉదరకోశ పుండ్లు అంటే అల్సర్స్‌తో బాధపడుతున్నవారు, మద్యం ఎక్కువగా తాగేవారు, మూత్రకోశ రాళ్ళతో బాధపడుతున్నవారు చికెన్ తినకుండా వుండటం మంచిది.