Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వర్షాలు పడుతున్నాయి, గోరువెచ్చని నీళ్లు తాగితే...

Written By సిహెచ్
Updated: మంగళవారం, 20 జులై 2021 (22:04 IST)
వానా కాలం వచ్చింది అనగానే జబ్బులు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటారు. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. వేడినీళ్లు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కొందరిలో చెమటలు పడతాయి. ఆ చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్లి శరీరం శుద్ధి జరుగుతుంది.
 
బాగా జలుబు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో కాస్త విక్స్, లేదా పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టండి. ఎంత ఉపశమనం కలిగిస్తుందో మీరే గమనించవచ్చు.
 
నరాలు, కండరాలు కూడా చురుకుగా పనిచేసేందుకు వేడినీళ్లు ఉపయోగపడతాయి. నరాలు చురుకుగా ఉండడం వల్ల మన ఆలోచనలు చురుకుగా ఉంటాయి. అంటే వేడినీళ్లు తాగడం వల్ల శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతుంది.
 
ఫిల్టర్ నుంచి పట్టిన నీళ్లను స్టౌ మీద తగినంతగా వేడిచేసుకొని తాగాలి. వర్షాకాలంలో ఇబ్బందిపెట్టే జ్వరాలు, జలుబు, దగ్గుతో ఇబ్బందిపడేవారు గోరువెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగాలి. దీనిద్వారా శ్వాస సక్రమంగా ఆడుతుంది. వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ఉపశమనం కలుగుతుంది.

అన్నీ చూడండి

Tribal Girls: వరంగల్ జిల్లాలో అపహరణకు గిరిజన బాలికలు

Donald Trump: ఉగ్రవాద దాడికి ఇరాన్ బాధ్యత వహించింది.. డొనాల్డ్ ట్రంప్

వివేకానంద రెడ్డి హత్య కోసం రూ.40 కోట్ల సుపారీ చెల్లించారు.. చంద్రబాబు ధ్వజం (video)

ఏపీలో కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు - మొత్తం ఆరుకు చేరిన సంఖ్య

నాన్నా మీ అంచనాలను అందుకోలేకపోతున్నాను.. టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

Chiranjeevi, Ramya Krishnan: మెగాస్టార్ చిరంజీవి కాక లో విజయశాంతి ప్లేస్ లో రమ్యక్రిష్ణ ?

FAU-G. footage leaked : ఫౌజీ నుండి లీకైనట్లుగా చెబుతున్న ఫుటేజ్ పై ఇంటర్నెట్ హోరు

Hanuman Ansh: త్రివిక్రమ్ కు చేజారిన హనుమాన్ అంశ్ - తెలుగులో హోంబలే ఫిల్మ్స్ కు హక్కులు

NTR 15 Years :ఎన్.టి.ఆర్. నటించిన ఊసరవెల్లి కి 15 ఏళ్లు: అభిమానుల సంబరాలు

'నిన్నే పెళ్లాడతా'కు 30 సంవత్సరాలు.. టబు ఎమోషనల్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments