సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 10 డిశెంబరు 2020 (21:08 IST)

తక్కువ నిద్ర, ఎక్కువ బరువుతో స్థూలకాయం, ఎందుకో తెలుసా?

తక్కువ నిద్రపోయేవారు అధిక బరువు పెరిగి స్థూలకాయులవుతారని ఇటీవలి చేసిన అధ్యయనంలో తేలింది. వరుసగా నాలుగు రాత్రులు తక్కువ నిద్రపోవడం వల్ల బరువు పెరిగిపోతారని జర్నల్ ఆఫ్ లిపిడ్ రీసెర్చ్‌లో తేలింది.
 
తగినంత నిద్ర లేకపోవడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం, డయాబెటిస్ వ్యాధులే కాకుండా క్యాన్సర్ కూడా కొన్ని సందర్భాల్లో పెరుగుతుందని అధ్యయనం చూపించింది.
 
ఈ అధ్యయనం నిర్వహించడానికి, పరిశోధకులు ఇరవై ఏళ్లు వయసున్న 15 మంది ఆరోగ్యకరమైన పురుషులను తీసుకున్నారు. ఈ పురుషులు, మొదటి వారంలో సరిగ్గా తినమని అడిగారు. ప్రతి రాత్రి 10 గంటలు నిద్రపోవాలని కోరారు. తరువాతి 10 రోజులు తర్వాత క్లినికల్ రీసెర్చ్ సెంటర్లో వారిని పరీక్షలు చేశారు.
 
వీరికి మధ్యలో వుండగా మిరపకాయ, పాస్తా అధిక కొవ్వు, అధిక కేలరీల విందును తినిపించారు. ప్రతి రాత్రి 5 గంటలకు మించకుండా నిద్రపోవాలని కోరారు. నాలుగు రాత్రుల తరువాత రక్త పరీక్షలు చేసినప్పుడు, నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ అధికంగా వున్నట్లు ఫలితాలు చూపించాయి.
 
ఇన్సులిన్ మనం తినే ఆహారం నుండి చక్కెర(గ్లూకోజ్)ను శరీరానికి శక్తిని ఇస్తుంది. కాబట్టి, శరీరంలో ఇన్సులిన్ అధిక స్థాయిలో ఉన్నందున, ఆహారంలోని కొవ్వులు లేదా లిపిడ్లు త్వరగా తినడం వల్ల చివరికి బరువు పెరుగుతారు.