శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (10:49 IST)

బరువు తగ్గటానికి వోట్స్ తీసుకునేవారు ఇది తెలుసుకోవాలి (Video)

వోట్స్... బరువు తగ్గించుకోవాలనుకునేవారు ఎంచుకునే మార్గంగా మారింది. షాపుల్లో వివిధ రకాల వోట్స్ ప్యాకెట్లు అందుబాటులో వుంటాయి. కానీ కొన్ని రకాల వోట్స్ ప్యాకెట్లలో వివిధ పదార్థాల ఎసెన్స్ కలపడంతో అదనపు కేలరీలు వచ్చే అవకాశం వుందంటున్నారు వైద్య నిపుణులు. 
 
వోట్మీల్ ఆహారంతో సమస్యలు
వోట్స్, వోట్మీల్ తినడం వల్ల అది బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. ఐతే ఈ కారణంగా ఒక వ్యక్తికి రోజూ అవసరమైన పోషకాలను అందవు. వోట్మీల్ ఆహారం చాలా తక్కువ కేలరీల ఆహారం, ఇది ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరికీ సురక్షితం కాదు.
 
బరువు తగ్గాలని చాలామంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వోట్స్ తీసుకుంటే మరే ఇతర పదార్థాలను తీసుకోరు. ఇలాంటివారికి బరువు తగ్గే సమస్య అటుంచి కొత్త సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల దీర్ఘకాలిక బరువు తగ్గడానికి వోట్స్ సిఫారసు చేయబడలేదు.
 
వోట్మీల్ డైట్ ఎలా తీసుకోవాలి? జాగ్రత్తలు ఏంటి?
సరైన ఫిట్‌నెస్ ఫలితాల కోసం, మీ డైటీషియన్ చెప్పినట్లుగా లేదా సూచించిన విధంగా ఆహారాన్ని అనుసరించాలి.
వోట్మీల్ తయారు చేయడం ఎలాగో సరైన మార్గం తెలుసుకోవాలి.
రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.
ఆల్కహాల్ లేదా ఇతర ఖాళీ కేలరీలను పెంచే వాటిని తీసుకోరాదు.
ఫిట్‌నెస్ సూత్రాలకు కట్టుబడి ఉండాలి.
ప్రతి రోజూ రాత్రి తగినంత నిద్ర పోవాలి.