శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 9 ఆగస్టు 2024 (23:16 IST)

రొమ్ము శస్త్రచికిత్స తర్వాత తల్లిపాలు ఎలా ఇవ్వాలి?: తల్లులకు ముఖ్యమైన సమాచారం

Doctor Geethika
తల్లిపాలు ఇవ్వడం మాతృత్వంలో ఒక భాగం. తల్లి- బిడ్డ ఇద్దరికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. అయితే, రొమ్ము శస్త్రచికిత్స చేయించుకునే తల్లులకు, ఇది విభిన్నమైన సవాలుగా మారుతుంది. ఈ సవాళ్లను అర్థం చేసుకోవడం, అలాంటి చికిత్స జరిగినప్పుడు సరైన సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యం.
 
రొమ్ము శస్త్రచికిత్స రకాలు- తల్లి పాలు పట్టడంలో వాటి ప్రభావం
తల్లి చేయించుకునే రొమ్ము శస్త్రచికిత్స రకం, తల్లి పాలిచ్చే సామర్థ్యంపై గణనీయంగా ప్రభావాన్ని చూపవచ్చు లేదా కొద్దిగా ప్రభావితం చేయవచ్చు. ‘రొమ్ము మెరుగుదల చికిత్స’, ‘రొమ్ము సైజు తగ్గింపు’, ‘శస్త్ర చికిత్స ద్వారా రొమ్మును తీసివేయడం’ వంటివి సాధారణంగా చేసే కొన్ని శస్త్రచికిత్సలు. ఈ శస్త్రచికిత్సలు నాళాలను పలు రకాలుగా ప్రభావితం చేస్తాయి. నరాలు అలాగే రొమ్ము కణజాలం మొత్తం కూడా మారుతాయి.
 
థీస్ట్ ఆగ్మెంటేషన్ (రొమ్ము సైజును పెంచడం): ఇది సాధారణంగా తల్లి పాలివ్వడంలో తక్కువ ప్రభావాన్ని చూపుతుంది, ఈ చికిత్సలో కండరాల క్రింద ఇంప్లాంట్‌లను ఉంచడం జరుగుతుంది. చను మొనల వద్ద శస్త్రచికిత్స కోతల వలన పాల ఉత్పత్తికి అవసరమైన పాల నాళాలు, నరాలు దెబ్బతింటాయి, కాకపోతే ఇది సాధారణంగా రొమ్ము రూపాన్ని గణనీయంగా మార్చదు.
 
రొమ్ము సైజు తగ్గింపు: ఇది తల్లిపాలు ఇచ్చే ప్రక్రియకు హానికరం, ఎందుకంటే ఇందులో రొమ్ము కణజాల భాగాలను తీసివేయడం జరుగుతుంది, ఇది పాల నాళాలు, నరాలను ప్రభావితం చేస్తుంది, ఇది శస్త్రచికిత్సా విధానం, కణజాల తొలగింపు యొక్క పరిధిని బట్టి ఉంటుంది.
 
మాస్టెక్టమీ (శస్త్ర చికిత్స ద్వారా రొమ్ము తీసివేయడం): శస్త్ర చికిత్స ద్వారా రొమ్ము తీసివేసే, అంటే ప్రత్యేకించి బైలేట్రల్ పద్ధతి ద్వారా రొమ్మును తీసివేసే శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ, తీసివేసిన రొమ్ముల నుండి తన బిడ్డకు ఆహారం ఇచ్చే(పాలు పట్టే) స్థితిలో ఖచ్చితంగా ఉండదు. మహిళకు ఒక రొమ్మును మాత్రమే తీసివేసినట్లయితే, మరొక రొమ్ము నుండి ఆమె తన బిడ్డకు పాలివ్వవచ్చు.
 
శస్త్రచికిత్స తర్వాత తల్లి పాలివ్వడంలో ఉన్న ఇబ్బందులు
తక్కువ పాలు రావడం: శస్త్ర చికిత్స ద్వారా రొమ్ము తీసివేయడం, ఇతర రకాల శస్త్ర చికిత్సలు పాల కణజాలాల సాధారణ పనితీరును దెబ్బతీయవచ్చు, తద్వారా పాల ఉత్పత్తి తగ్గవచ్ఛు. శిశువుకు తగినంత ఆహారం లభిస్తుందో లేదో తెలుసుకోవడానికి, శిశువు బరువు పెరుగుదలను అలాగే రోజుకు తడిగా ఉన్న డయాపర్‌ల సంఖ్యను గమనించాలి.
 
చనుమొన సున్నితత్వం: ఇంకా, శస్త్రచికిత్స అనేది చనుమొన యొక్క సున్నితత్వాన్ని ప్రభావితం చేస్తుంది, దీని వలన తల్లి తన బిడ్డకు నోటిలో రొమ్మును పెట్టడం కష్టమవుతుంది, దీని వలన సరిగ్గా పాలు పట్టలేకపోవచ్చు. ఇది సున్నితత్వానికి దారి తీస్తుంది. పాలు పట్టే సమయంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తుంది.
 
ఇంగోర్జమెంట్- మాస్టిటిస్: చిట్లిన నాళాల వలన రొమ్ములు పూర్తిగా పాడైయ్యి, పాలు ఇవ్వలేని పరిస్థితికి దారి తీయవచ్చు, దీని వలన అవి ఉబ్బుతాయి. సాధారణంగా బాధాకరమైన రొమ్ము ఇన్ఫెక్షన్ ఉన్న మహిళకి శస్త్ర చికిత్స ద్వారా రొమ్ము తీసేసే అవకాశం ఉంది.
 
తల్లిపాలను చక్కగా పట్టడం కోసం చిట్కాలు
చనుబాల నిపుణుడిని (లాక్టేషన్ ఎక్స్‌పర్ట్) సంప్రదించండి: చనుబాల (లాక్టేషన్) కన్సల్టెంట్‌ను సంప్రదించడం ద్వారా సలహా మరియు సహాయం పొందడం కోసం అభ్యర్థించవచ్చు. వారు చిన్న పిల్లలకి పాలు పట్టేటప్పుడు ఎలా కప్పుకోవాలో, పాల మొత్తాన్ని ఎలా పెంచాలనే దానిపై తగిన సలహా ఇవ్వడం జరుగుతుంది.
 
తరచుగా ఫీడింగ్- పంపింగ్ చేయడం: వీలైనంత తరచుగా తల్లిపాలు పట్టేలా తల్లిని ప్రోత్సహిస్తారు. పాలు వచ్చేలా చేయడానికి అవసరమైతే బ్రెస్ట్ పంప్‌ని ఉపయోగించమని ప్రోత్సహిస్తారు. శిశువుకు పాలు పట్టిన తర్వాత పంపింగ్ చేయడం ద్వారా రొమ్ముల నుండి తగిన మొత్తంలో పాలను డబ్బాలో పట్టుకోవచ్చు.
 
గెలాక్టాగోగ్స్: తల్లి పాల ఉత్పత్తిని పెంచే ఆహారాలు, సప్లిమెంట్లు ఉన్నాయి. ఈ గెలాక్టాగోగ్స్ అన్నింటినీ చికిత్స ప్రారంభించే ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణుల సలహా మేరకు తీసుకోవాలి.
 
దాత(డోనార్) పాలు లేదా ఫార్ములాతో అందిచడం: పాలు సరఫరా ఇప్పటికీ తగినంతగా లేకుంటే, శిశువుకు దాత (డోనార్) పాలు లేదా ఫార్ములాతో ఆహారం అందించడం అవసరం, తద్వారా ఆ పాప/బాబుకు బాగా పోషకాహారం అందుతుంది. దీని వలన తల్లిపాలను ఇచ్చే విషయంలో రాజీ పడకుండా ఉండవచ్చు.
 
భావోద్వేగ మరియు మానసిక మద్దతు
సిజేరియన్ సెక్షన్ తర్వాత తల్లిపాలు ఇవ్వడం మానసికంగా సవాలుతో కూడుకున్న విషయంగా ఉంటుంది. చాలామంది తల్లులు తల్లి పాలివ్వడంలో ఆశించిన విధంగా పాలు రాకపోవడంతో నిరాశ లేదా నిరుత్సాహానికి గురవుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, మద్దతు సమూహాల నుండి పొందే సహాయం చాలా అవసరమైన భావోద్వేగ మద్దతును అందించగలదు. వృత్తిపరమైన కౌన్సెలింగ్ కూడా వారికి మంచి అనుభూతిని అందించడంలో సహాయపడుతుంది.
 
రొమ్ము శస్త్రచికిత్స తర్వాత తల్లిపాలు పట్టడానికి చాలా అవగాహన, సహనం మరియు మద్దతు అవసరం. ఏర్పడే సమస్యలను అర్థం చేసుకోవడం, కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు తెలుసుకోవడం వలన తల్లి పాలిచ్చే అనుభూతిలో నైపుణ్యం పొందడంలో సహాయపడుతుంది. ప్రతి తల్లి ప్రయాణం కొద్దిగా భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి, అవసరమైనప్పుడు సహాయం కోసం అభ్యర్థించండి.
 
-డాక్టర్ గీతిక వాకాటి, ఎంబిబిఎస్, ఎంఎస్(జనరల్ సర్జన్), అపోలో స్పెక్‌ట్రా హాస్పిటల్స్, హైదరాబాద్.