Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిపట్టునే ఆక్సిజన్ పల్స్ చెక్ చేసుకోవడం ఎలా?

Written By ఠాగూర్
Updated: గురువారం, 22 ఏప్రియల్ 2021 (11:00 IST)
కరోనా వైరస్ సోకిన రోగుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఈ కారణంగానే చాలా మంది మృత్యువాతపడుతున్నారు. అయితే, కరోనా వైరస్ సోకి, ఇంటిపట్టునే చికిత్స తీసుకుంటున్న వారు ఆక్సిజన్ లెవెల్స్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా చేసుకోవాలో ఓసారి తెలుసుకుందాం. 
 
కరోనా పాజిటివ్‌ వచ్చినా, లక్షణాలులేకుండా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్న వారు పల్స్‌ ఆక్సీమీటర్‌ (ఫింగర్‌ డివైజ్‌)ను కొనుగోలు చేసుకోవాలి. కరోనా సోకని వారూ వీటిని కొనుగోలు చేసుకుని భద్రపరుచుకోవచ్చు. పల్స్‌ ఆక్సీమీటర్‌ను వేలికి పెట్టుకుంటే పల్స్‌తోపాటు రక్తంలో ఆక్సిజన్‌ ఎంతుందో ఇది సూచిస్తుంది. 
 
ప్రతి వ్యక్తికి రక్తంలో ఆక్సిజన్‌ 100 శాతం ఉండాలి. 95 శాతం వరకూ సాధారణంగా, 90-95 శాతం మధ్యలో ఉంటే మోడరేట్‌గా, 90 శాతం కన్నా తక్కువ ఉంటే ప్రమాదకరంగా భావించి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. 97 శాతం ఆక్సిజన్‌ ఉన్నప్పుడు ఆరు నిమిషాలు నడిచిన తర్వాత ఐదు శాతం కంటే ఎక్కువ (92శాతం కంటే) తగ్గితే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. 
 
కరోనా రోగులకు మూడు శాతం తగ్గినా చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పల్స్‌ 70 నుంచి 100 మధ్యలో ఉంటే సాధారణంగా భావిస్తారు. 60 కంటే తక్కువ ఉంటే హార్ట్‌ రేటింగ్‌ తగ్గిందని, 100 కంటే ఎక్కువగా ఉంటే పెరిగినట్లు పరిగణిస్తారు. 

అన్నీ చూడండి

భాజపాకి షాకిచ్చిన PK, 3 దశాబ్దాల కోటను బద్ధలు కొట్టిన ప్రశాంత్ కిషోర్

వివాహం చేసుకోలేదని మహిళలకు రక్షణను నిరాకరిస్తారా?: సుప్రీం కోర్టు

మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. ఏమైనా పనికొచ్చిందంటారా?

సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహహింస చట్టం : సుప్రీంకోర్టు

Khammam: రీల్స్ చేస్తూ సస్పెండ్ అయిన టీచర్.. ఉద్యోగానికి రాజీనామా.. ఎందుకంటే? (video)

అన్నీ చూడండి

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

కార్తి, మోహన్ రాజా కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

తర్వాతి కథనం
Show comments