పీనట్ బటర్ తీసుకుంటే ఫలితం ఏంటి? (video)
పీనట్ బటర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రోటీన్-ప్యాక్డ్ పదార్థం. ఇది వేరుశెనగతో తయారుచేయబడుతుంది. అయితే పీనట్ బటర్ కొనుగోలు చేసేటప్పుడు లేబుల్‌ని తనిఖీ చేయడం ముఖ్యం. అనేక బ్రాండ్లు నేడు చక్కెర, కూరగాయల నూనె, ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి పదార్ధాలు కలిపి దాని పోషక విలువను తగ్గించే అవకాశం వుంది.
సహజమైన పీనట్ బటర్ కిరాణా దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. పీనట్ బటర్ రాగికి మంచి మూలం. ఇది మన ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు, రక్త నాళాలను నిర్వహించడానికి సహాయపడే ఖనిజం. ఆహారంలో తగినంత రాగిని తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.