శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (10:57 IST)

ఒక ముద్ద ఆహారం తీసుకుంటే 24 సార్లు నమలాలి.. సద్గురు

''యోగాలో ''మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలి'' అని చెబుతాం. దీని వెనక ఎంతో సైన్స్ ఉంది, కానీ ముఖ్యమైన విషయమేమిటంటే మీ ఆహారం మీ నోటిలో ముందే జీర్ణమైపొతే అది మీ వ్యవస్థలో

''యోగాలో ''మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలి'' అని చెబుతాం. దీని వెనక ఎంతో సైన్స్ ఉంది, కానీ ముఖ్యమైన విషయమేమిటంటే మీ ఆహారం మీ నోటిలో ముందే జీర్ణమైపొతే అది మీ వ్యవస్థలో ఎలాంటి మందకొండితనాన్ని సృష్టించదు. మరొక విషయమేమిటంటే, మీరు కనుక దాన్ని ఇరవై నాలుగు సార్లు నమిలితే, ఆ ఆహరం యొక్క సమాచారం మీ శారీరిక వ్యవస్థలో స్థాపితమవుతుంది. 
 
అప్పుడు మీ శరీరంలోని ప్రతీ కణం మీకు ఏది సరైనదో, ఏది సరైనది కాదో నిర్ణయించడం మొదలుపెడుతుంది – అంటే కేవలం నాలుక విషయంలోనే కాదు, మొత్తం వ్యవస్థ విషయంలో ఇలా జరుగుతుంది. మీరిది కొంత కాలం పాటూ చేస్తే, మీ శరీరంలోని ప్రతీ కణానికి దానికేది ఇష్టమో, అయిష్టమో అన్న విషయంపై అవాగాహన ఏర్పడుతుంది.'' – సద్గురు
 
భోజనం చేసేటప్పుడు నీళ్ళను తీసుకోకపోవటం కూడా మంచిది. భోంచేయడానికి కొద్ది నిమిషాల ముందో లేదా భోంచేసిన 30 లేదా 40 నిమిషాల తరువాతో కొద్దిగా నీళ్ళు తీసుకోవడం మంచిది. రాత్రి వేళ రాగి పాత్రలో నీటిని ఉంచితే, అది క్రిములను నాశనం చేయడమే కాకుండా, ఆ నీటిని శక్తివంతం చేస్తుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్(ఐసీయు)లలో పరీక్షించిన రాగి ఉపరితలాలు ఆసుపత్రుల ద్వారా సోకే ఇన్ఫెక్షన్లను వ్యాపింపచేసే బ్యాక్టీరియాని 97 శాతం నాశనం చేస్తాయని తేలింది.