మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (14:03 IST)

వేసవిలో ఐస్‌క్రీమ్స్ తీసుకుంటున్నారా... ఈ విషయాలు మీ కోసం...

చల్లటి పదార్థాలు తినాలంటే చాలామంది బయపడుతుంటారు. ఎందుకుంటే చల్లని పదార్థాలు తినగానే తలనొప్పి వస్తుందంటారు. దీనికే బ్రెయిన్ ఫ్రీజ్ అని పేరు. మరీ ముఖ్యంగా కొందరిలో ఐస్‌క్రీమ్ తిన్న తరువాత అది నోటిలోని ప

చల్లటి పదార్థాలు తినాలంటే చాలామంది బయపడుతుంటారు. ఎందుకుంటే చల్లని పదార్థాలు తినగానే తలనొప్పి వస్తుందంటారు. దీనికే బ్రెయిన్ ఫ్రీజ్ అని పేరు. మరీ ముఖ్యంగా కొందరిలో ఐస్‌క్రీమ్ తిన్న తరువాత అది నోటిలోని పైభాగాన్ని తగిలేలా కరుగుతూ పోయాక కాసేపట్లో తలనొప్పి వస్తుంటుంది. మరికొందరిలో చల్లటి పదార్థాలు లేదా పానీయాలు త్రాగితే తలనొప్పి వస్తుంది.
 
అందుకే కోల్డ్ స్టిమ్యులస్ హెడేక్ అని పేరున్న దీన్ని ఐస్‌క్రీమ్ హెడేక్ అని అంటారు. నోటిలోకి చల్లటి పదార్థాలను తీసుకోగానే నోటి పైభాగంలోని అంగలిలో ఉండే రక్తనాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోతాయి. ఆ తరువాత నోటిలోని వేడి వలన రక్తనాళాలు వ్యాకోచం చెందగానే రక్తం దూసుకొచ్చినట్లుగా ఉంటుంది. దీని ఫలితంగా నోట్లో ఐస్‌క్రీమ్‌ను పెట్టిన వైపు తలనొప్పి రావడం సహజం.
 
సాధారణంగా ఇలా వచ్చే తలనొప్పి దాదాపు పది లేదా 20 సెకండ్లు వరకుంటుంది. ఒక్కోసారి మహా అయితే కొద్ది నిమిషాలు ఉంటుంది. దీనిని నివారించడానికి చేయవలసినది ఏదైనా చల్లటివి తింటున్నప్పుడు వేగంగా తినకుండా నెమ్మదిగా తినాలి. అలాకాకుంటే కాసేపు తరువాత వేడిగా ఉన్న పానీయం తీసుకుంటే ఆరోగ్యానికి, తలనొప్పికి చాలా మంచిది. అలాకాకుంటే గోరువెచ్చటి నీళ్లు త్రాగినా సరిపోతుంది. ఇలా చేయడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చును.