గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 7 జనవరి 2018 (10:44 IST)

చింతపండుతో అంత మేలా?

చింతపండు పులుపు. ఎక్కువ వాడకండి అంటుంటారు చాలామంది. అయితే చింతపండు గుజ్జులో ఫైబర్ అధికంగా వుంటుంది. ఇది అజీర్తికి చెక్ పెడుతుంది. చింతపండు పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చింతపండులో ఫైబర్,

చింతపండు పులుపు. ఎక్కువ వాడకండి అంటుంటారు చాలామంది. అయితే చింతపండు గుజ్జులో ఫైబర్ అధికంగా వుంటుంది. ఇది అజీర్తికి చెక్ పెడుతుంది. చింతపండు పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చింతపండులో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి హానికారక ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది. తద్వారా క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. క్యాన్సర్‌పై పోరాడే గుణాలు చింతపండులో పుష్కలంగా వున్నాయని వారు అంటున్నారు. 
 
ఇక చింతపండులో పొటాషియం పుష్కలంగా వుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఫలితంగా హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. చింతపండులో ఐరన్ ఎక్కువగా ఉండటం రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. ఇంకా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయడంలో ఈ చింతపండు భేష్‌గా పనిచేస్తుంది. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు. చింతపండు కాలేయ ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.