ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (16:28 IST)

బరువు తగ్గాలా? కొబ్బరినూనెను వంటల్లో వాడండి.. మరి డిమాండ్?

కొబ్బరి నూనెను వంటల్లో వాడటం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనె శరీర బరువును తగ్గించటంలో శక్తివంతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో ట్రైగ్లిసరైడ్‌లు జీవక్రియను

కొబ్బరి నూనెను వంటల్లో వాడటం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనె శరీర బరువును తగ్గించటంలో శక్తివంతంగా పనిచేస్తుంది.

కొబ్బరినూనెలో ట్రైగ్లిసరైడ్‌లు జీవక్రియను పెంచి, శక్తి వినియోగాన్ని రెట్టింపు చేస్తాయి. కావున బరువు తగ్గించుకోవాలనుకునే తీసుకునే ఆహార పదార్థాల్లో కొబ్బరినూనెను వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో కొబ్బరినూనె వాడకం అధికమైందని తేలింది. గత ఏడాదితో పోల్చితో కొబ్బరినూనె వాడకం పెరిగిందని.. పది మందిలో ఏడుగురు కొబ్బరి నూనె ఆరోగ్యకరమని 2016 నుంచి నమ్ముతున్నట్లు తేలింది. 2017లోనూ ప్రజలు కొబ్బరి నూనెను అధికంగా వాడుతున్నట్లు పరిశోధనలో తేలింది. 
 
ఎందుకంటే.. కొబ్బరి నూనెలోని చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బరువును తగ్గిస్తాయని, వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అమెరికాలో నిర్వహించిన పరిశోధనలో 2011 నుంచి 2017 వరకు కొబ్బరి నూనెను వంటల్లో వాడటం అధికమవుతూ వస్తుందని తేలింది. 
 
కానీ 2015లో మాత్రం కొబ్బరి నూనె వాడకం తగ్గిందని, ఇందులో భాగంగా 30 శాతం మేర కొబ్బరినూనె అమ్మకాలు పడిపోయాయని పరిశోధకులు చెప్పారు. కానీ కొబ్బరి నూనె ప్రయోజనాలు తెలుసుకున్న చాలామంది ఆ తర్వాత దాన్ని వాడకాన్ని పెంచుకున్నట్లు తేలింది.