శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (18:51 IST)

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదములతో గుండెకు చక్కటి ఆరోగ్యాన్ని బహుమతిగా అందించండి

ప్రతి సంవత్సరం, ప్రపంచ హృదయ దినోత్సవాన్ని 29 సెప్టెంబర్‌‌న వేడుకగా జరుపుకుంటుంటారు. ఈ దినోత్సవం ద్వారా కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు (సీవీడీ) పట్ల అవగాహన మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండె వ్యాధులు, స్ట్రోక్‌ స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రపంచంలో నెంబర్‌ 1 కిల్లర్‌గా సీవీడీ నిలుస్తుంది. ఈ సీవీడీ కారణంగానే ప్రతి సంవత్సరం 18.6 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి.
 
భారతదేశంలో కూడా అత్యధిక సంఖ్యలో మరణాలకు ఇది కారణమవుతుంది. ఈ సంవత్సరం, ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ సంక్షోభంకు అనుగుణంగా ప్రపంచ హృదయ దినోత్సవ నేపథ్యాన్ని ‘యూజ్‌ హార్ట్‌ టు కనెక్ట్‌’గా తీసుకున్నారు. ఈ నేపథ్యానికి అనుగుణంగానే, డిజిటల్‌ మాధ్యమాల శక్తిని వినియోగించుకుంటూ ప్రజలకు అవగాహన మెరుగుపరచడంతో పాటుగా అంతర్జాతీయంగా సీవీడీని నివారించడం, అత్యుత్తమంగా నిర్వహించడం చేస్తున్నారు.
 
నూతన సాధారణతకు అనుగుణంగా ప్రపంచం తనను తాను తీర్చిదిద్దుకుంటున్న వేళ, ఓ అడుగు వెనుకకు వేసి కుటుంబాలు, వ్యక్తులు అనుసరిస్తున్న జీవనశైలి ప్రాధాన్యతలను సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ప్రమాదకరమైన వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అత్యుత్తమ గుండె ఆరోగ్యం కోసం మన ప్రయాణం ఆరంభించడానికి, ఆరోగ్యవంతమైన జీవనశైలి ఎంపికలను చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అత్యంత విలువైన అంశంగానూ నిలుస్తుంది. మీ కుటుంబంతో పాటుగా మీ సొంత రోజువారీ ఆహారానికి ఓ గుప్పెడు బాదములను జోడించడంతో దీనిని ఆరంభించండి. బాదములలో విభిన్నమైన పోషకాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఆరోగ్యవంతమైన స్నాక్‌గానూ నిలుస్తాయి.
 
ఆరోగ్యవంతమైన గుండెకు ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించాల్సిన ఆవశ్యకతను సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ వెల్లడిస్తూ, ‘‘చక్కటి ఆరోగ్యానికి పౌష్టికాహారం అత్యంత కీలకం. మీతో పాటుగా మీ కుటుంబ ఆరోగ్యం కూడా బాగుండాలంటే తగిన ప్రయత్నం చేయాల్సి ఉంది. అయితే, దీర్ఘకాలంలో, చిన్నవే అయినప్పటికీ ఆలోచనాత్మకంగా మీ డైట్‌, జీవనశైలిలో చేసే మార్పులు అత్యంత కీలకంగా నిలుస్తాయి.
 
భారతదేశ వ్యాప్తంగా అనేక కుటుంబాలలో సీవీడీ  సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి  అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో పాటుగా తగిన జీవనశైలి  మార్పులను కూడా చేసుకోవాల్సి ఉంది. అలా చేసుకోతగిన మార్పులలో అత్యంత సులభమైనది ఫ్రై లేదా ప్రాసెస్డ్‌ పదార్థాలకు బదులుగా ఆరోగ్యవంతమైన అవకాశాలైనటువంటి డ్రై, సాల్టెడ్‌ లేదా ఫ్లేవర్డ్‌ బాదములను తీసుకోవడం.
 
బాదములలో విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, జింక్‌ మొదలైన పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యవంతమైన స్నాక్‌గా దీనిని మలుస్తున్నాయి. పరిశోధనలు సూచించే దాని ప్రకారం, క్రమం తప్పకుండా బాదములు తీసుకున్న ఎడల హానికరమైన ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గడంతో పాటుగా గుండె ఆరోగ్యం కాపాడే హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్ధాయి పెరుగుతుంది. అంతేకాదు, టైప్‌ 2 మధుమేహంతో బాధపడే వారికి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే వాపులను సైతం తగ్గించడంలో బాదములు సహాయపడతాయి’’ అని అన్నారు.
 
ఫిట్‌నెస్‌, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ, ‘‘చక్కటి గుండె ఆరోగ్యం నిర్వహించడంలో, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడమూ అత్యంత కీలకం. శారీరక వ్యాయామాలు గుండె కండరాలను బలోపేతం చేయడంతో పాటుగా, రక్తపోటు అత్యుత్తమంగా నిర్వహించడంలోనూ తోడ్పడతాయి. అదే రీతిలో కొలెస్ట్రాల్‌ స్ధాయిలు నిర్వహించడం, ఒకరు తమ బరువు నియంత్రణలో ఉంచుకోవడమూ సాధ్యమవుతుంది. అందువల్ల కనీసం 30 నిమిషాల నుంచి ఒక గంట పాటు మీరు ఆస్వాదించగలిగిన వ్యాయామాలను చేయడానికి కేటాయించండి.
 
మీరు మీ హోమ్‌వర్కవుట్‌ను శిక్షకుని సమక్షంలో (భౌతికంగా లేదా వర్ట్యువల్‌గా) చేయడం లేదా డ్యాన్స్‌ క్లాస్‌లో  హాజరవడం, యోగా అభ్యసించడం, ఏరోబిక్స్‌ చేయడం లేదా పరుగులు పెట్టడం చేయవచ్చు. కానీ, మీరు ఎలాంటి వ్యాయామం ఎంచుకున్నా సరే, ఖచ్చితంగా మూడు అంశాలను చేయడం మాత్రం మరువవద్దు. మొదటిది, మీ డాక్టరును సంప్రదించి, ఏ తరహా వ్యాయామం మీకు అత్యుత్తమంగా సరిపోతుంది, మరీ ముఖ్యంగా మీ ఆరోగ్య స్థితిని అనుసరించి ఎలాంటి వ్యాయామాలు చేయాలనేది తెలుసుకోవడం.
 
రెండవది, క్రమం తప్పకుండా, నిబద్ధతతో వాటిని అనుసరించడం. మూడవది, మీ ఆరోగ్యం కోసం అనుసరించే వ్యాయామాలతో పాటుగా  ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ అయినటువంటి బాదములు లాంటివి తీసుకోవడం. బాదములు, శరీరానికి తగిన శక్తిని అందించడంతో పాటుగా ఆకలి తీర్చే గుణాలు కూడా కలిగి ఉన్నాయి. ఇవి చక్కటి స్నాక్‌గా నిలువడంతో పాటుగా వర్కవుట్‌కు ముందు, వెనుక చక్కటి స్నాక్‌గానూ నిలుస్తుంది. బాదములలో ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్‌ ఉంటాయి మరియు అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం తరచుగా బాదములను తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన గుండెను నిర్వహించడం సాధ్యం కావడంతో పాటుగా ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గించుకోవడమూ సాధ్యమవుతుంది’’ అని అన్నారు
 
న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నవి కార్డియో వాస్క్యులర్‌ వ్యాధులు. దీనికితోడు, మహమ్మారి కారణంగా నిశ్చల జీవనశైలి పెరిగింది. సుదీర్ఘకాలం పాటు కదలకుండా పని చేయడమూ పెరిగింది. వర్ట్యువల్‌గా ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలాగే అనారోగ్యకరమైన స్నాకింగ్‌, అస్సలు వ్యాయామాలు చేయకపోవడం లేదా తక్కువగా వ్యాయామాలు చేయడం వంటివి భారతీయులు సీవీడీ బారిన పడేందుకు దోహదపడుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో, తమ జీవనశైలి ప్రాధాన్యతలను పునః సమీక్షించుకోవడంతో పాటుగా తగిన మార్పులనూ చేసుకోవాల్సి ఉంది. ఆరోగ్యవంతమైన డైట్‌లో బాదములను భాగం చేసుకోవాలి. ఇది సీవీడీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బాదములతో డిస్లిపిడిమియా నియంత్రణలో ఉంచుకోవడమూ సాధ్యమవుతుంది. అత్యధిక ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిసరైడ్‌ స్ధాయిలు, అతి తక్కువ హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్ధాయికి ప్రతీకగా డిస్లిపిడిమియా నిలుస్తుంది’’ అని అన్నారు.
 
అందువల్ల, ఈ ప్రపంచ హృదయ దినోత్సవ వేళ, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవనశైలిని అనుసరించడానికి ప్రతిజ్ఞ చేయండి, అదే సమయంలో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు  ప్రియమైన వారు కూడా అనుసరించేలా ప్రోత్సహించండి.