శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 5 మార్చి 2023 (00:03 IST)

తిప్పతీగలో ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్

Tippa Teega plant
తిప్పతీగ. పొలాల్లో చెట్లను అల్లుకుని పిచ్చిమొక్కలా కనిపించే తీగజాతి మొక్క తిప్పతీగ. ఆయుర్వేద ఔషధాల్లో వాడే తిప్పతీగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడమే కాక మనస్సును ప్రశాంతంగా మార్చేసి ఒత్తిడిని పారదోలగల శక్తి తిప్పతీగకు వుంది. తిప్పతీగలో యాంటీ ఆర్థరైటిస్ గుణాలు ఉంటాయి కనుక ఈ సమస్య ఉన్నవారికి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
తిప్పతీగలో ఉండే ఆల్కలాయిడ్లు, లాక్టేన్లు అనబడే బయో యాక్టివ్ సమ్మేళనాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, శరీరంలో షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో తిప్పతీగ దోహదపడుతుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండటం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
 
తిప్పతీగను తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది, ఎందుకుంటే తిప్పతీగతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగుతుంది. తిప్పతీగను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తీసుకోరాదని ఆయుర్వేదం చెపుతోంది.