ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 1 మార్చి 2023 (20:28 IST)

యాపిల్స్ తింటే ఆ రిస్క్‌లు తక్కువ

Apple
యాపిల్స్ క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా యాపిల్స్ సహాయపడుతాయి. యాపిల్ తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. యాపిల్ పండ్లలో పోషకాలు అధికం. యాపిల్స్‌ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ. యాపిల్ తీసుకోవడం వల్ల బాడీ మాస్ ఇండెక్స్‌ను గణనీయంగా తగ్గించవచ్చు.
 
యాపిల్స్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఆపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, రొమ్ము, జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌లతో సహా కొన్ని రకాల క్యాన్సర్‌లపై పోరాడుతుంది. యాపిల్స్ మెదడును ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుండి కాపాడుతుంది. కొందరికి యాపిల్ తింటే ఎలర్జీ అనిపిస్తుంది, అలాంటి వారికి జలుబు చేసే అవకాశం వుంటుంది.