నడుమునొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..
సాధారణంగా మనలో కొంతమంది ఉద్యోగ రీత్యా ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ మధ్య కాలంలో చాలా మంది నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ నడుము నొప్పి బాధితులే.. కింద తెలిపిన ఈ చిన్న చిట్కాలను పాటిస్తే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అందరికీ అందుబాటులో ఉండే చిట్కాలతో నడుము నొప్పిని పోగొట్టుకోవచ్చు.
* నడుము నొప్పిని శాశ్వతంగా దూరం చేసుకోవాలంటే ఖర్జూర పండ్లు తిని, వేడి నీళ్లు తాగితే నడుము నొప్పి తగ్గుతుంది. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి. ఈ ప్రక్రియను అలాగే కనీసం నెల రోజుల పాటు చేస్తే నడుము నొప్పి పూర్తిగా తగ్గుతుంది.
* మేడి కొమ్మపాలు పట్టు వేస్తే కూడా నడుము నొప్పి చాలా వరకు తగ్గుతుంది. ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్ల సున్నపు నీళ్లు కలుపుకొని రోజూ ఉదయం తాగితే మూడు రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది.
* నల్లమందు, రసకర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి రాస్తే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే శొంఠి, గంధం తీసి నడుముపై పట్టువేసి తెల్లజిల్లేడు ఆకులు కడితే నడుము నొప్పి తగ్గిపోతుంది.
* వేడి నీటిలో వస్ర్తాన్ని ముంచి కాపడం పెట్టడం వల్ల నడుం నొప్పి చాలా వరకు అదుపులోకి వస్తుంది. కొన్ని ఐస్ ముక్కలను లేదా చల్లటి కూరగాయల ప్యాకెట్‌ను ఒక తువాలులో చుట్టి దానితో నడుముపై నెమ్మదిగా 15-20 సార్లు రుద్దితే ఉపశమనం లభిస్తుంది.