రోజుకు రెండు సార్లు జుట్టును దువ్వుకుంటే..?
రోజుకు రెండు సార్లు జుట్టు దువ్వడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. జుట్టు ఒత్తుగా, మృదువుగా వుండాలంటే.. జుట్టును రోజుకు రెండుసార్లు, ఉదయం ఒకసారి, పడుకునే ముందు ఒకసారి దువ్వాలని వైద్యులు అంటున్నారు. రోజుకు రెండు సార్లు దువ్వెనతో తల దువ్వడం ద్వారా మృత చర్మ కణాలు తొలగిపోతాయి.
జుట్టు పెరగడం జరుగుతుంది. అలాగే జుట్టును దువ్వడం వల్ల జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. అలాగే మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుంది. మాడుపై గల కణాలను దువ్వెన ద్వారా దువ్వడంతో యాక్టివేట్ చేయవచ్చు. తద్వారా రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
అలాగే ప్రతీరోజూ నూనెను వాడటం మరిచిపోవద్దు. సహజమైన, ఆరోగ్యకరమైన నూనెలను వెంట్రుకల మూలాల నుండి చివర్ల వరకు పట్టిస్తే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. తద్వారా జుట్టు నిగారింపును సంతరించుకుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.