మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (22:33 IST)

చింతపండు రసంతో ప్రయోజనాలు, ఏంటవి? (video)

చింతపండు రసం. ఈ రసం ప్రయోజనాలు చాలానే వున్నాయి. చింతపండు రసంలో యాసిడ్లు, మినరల్స్, డైటరీ ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. ఇది మంచి బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. అయినప్పటికీ దీనిపై మరింత పరిశోధనలు చేయవలసి వుంది.
 

చింతపండు రసంలో పొటాషియం, మెగ్నీషియం, కెరోటిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ రసం ఒక ప్రభావవంతమైన మందు. కండ్లకలక, పైల్స్, మధుమేహం, ఊబకాయాన్ని అడ్డుకోవడంలో ఇది సహాయపడుతుంది. హృదయ, కడుపు, చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.

 
ఈ రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వంటలలో రుచిని పెంచేదిగా ఉపయోగించబడుతుంది. చింతపండు రసం రక్త శుద్ధికి ఉపయోగపడుతుంది. అందువల్ల వారంలో ఒకసారి ఈ రసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని నిపుణులు చెపుతున్నారు.