గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 26 జూన్ 2023 (23:29 IST)

తేనె మోతాదుకి మించి సేవిస్తే ఏం చేస్తుందో తెలుసా?

honey milk
తేనె. ఈ తేనెను తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఐతే ఇదే తేనెతో నష్టాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తేనెను మోతాదుకి మించి అధికంగా వినియోగిస్తే రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. తేనెను క్రమంతప్పకుండా ఎక్కువసేపు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తేనె అధిక వినియోగం శరీరంలో ఫ్రక్టోజ్ పరిమాణాన్ని పెంచడమే కాకుండా చిన్న ప్రేగు బలహీనపడే అవకాశాలను పెంచుతుంది.
 
తేనెను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లకు హాని కలుగుతుంది. కొందరికి తేనె జీర్ణం కాదు మరికొందరికి అది ఎలర్జీ కూడా. తేనెను అధిక మోతాదులో సేవిస్తే బరవు పెరగడం ఖాయం.