కోడికూర (చికెన్)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?
కోడికూర అంటే లొట్టలేసుకుని ఆరగిస్తాం. చికెన్ కర్రీలను ఇష్టపడని మాంసప్రియులు ఉండరు. ప్రతి రోజూ కొన్ని వేల టన్నుల కోడికూరను వివిధ రకాలైన వంటకాల రూపంలో మాంసప్రియులు ఆరగిస్తున్నారు. అయితే, ఇలాంటి చికెన్‌లో కొన్ని భాగాలు ఆరగించకూడదని పోషక నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది కోడిమెడను ఇష్టంగా ఆరగిస్తారు. కానీ, ఈ భాగంలో చికెన్ లింఫ్ వ్యవస్థ ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను, బ్యాక్టీరియాను విడుదల చేస్తుంది. అందువల్ల చికెన్ మెడను ఆరగించడం వల్ల మన శరీరంలో కూడా అవి చేరి, ఆరోగ్యానికి హాని చేస్తాయని చెబుతున్నారు. చికెన్ తోకభాగం. ఈ భాగంలో అనేక క్రిములు, బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి మనకు అనారోగ్య సమస్యలను కలుగజేస్తాయి. అందువల్ల ఈ భాగాన్ని ఆరగించకూడదని చెబుతున్నారు.
చికెన్ ఉలవకాయను కూడా ఆరగించరాదని చెబుతున్నారు. ఎందుకంటే, కోడి ఆరగించే ఆహారాన్నే ఇది జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇందులో అనేక రకాలైన బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయి. అందువల్ల ఈ భాగాన్ని కూడా వదిలిపోయాలని సలహా ఇస్తున్నారు. చికెన్ ఊపిరితిత్తులు కూడా ఆరగించకూడదు. కోడికర్రీలో ఈ నాలుగు భాగాలను ఆరగించకపోవడం మంచిదని న్యూట్రిషినిస్టులు చెబుతున్నారు.