సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (11:07 IST)

ఆపరేషన్ గదికి వెళుతూ బ్రెస్ట్ కేన్సర్ రోగి ఏం చేసిందో చూడండి (Video)

సాధారణంగా ఆపరేషన్ అంటే ప్రతి ఒక్కరూ భయపడుతారు. అందునా కేన్సర్ బారిన పడినవారు అయితే, ప్రాణభయంతో వణికిపోతారు. కానీ మహిళ మాత్రం మిగిలిన వారందరికీ ఆదర్శంగా ఉంది. ఎందుకంటే.. బ్రెస్ కేన్సర్‌తో బాధపడుతూ వచ్చ

సాధారణంగా ఆపరేషన్ అంటే ప్రతి ఒక్కరూ భయపడుతారు. అందునా కేన్సర్ బారిన పడినవారు అయితే, ప్రాణభయంతో వణికిపోతారు. కానీ మహిళ మాత్రం మిగిలిన వారందరికీ ఆదర్శంగా ఉంది. ఎందుకంటే.. బ్రెస్ కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆ మహిళకు... వైద్యులు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ ఆపరేషన్‌కు ఆమె సమ్మతించింది. 
 
అయితే, ఆపరేషన్‌కు తీసుకెళ్లే రోగిని స్ట్రెక్చర్‌పై ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళుతుంటారు. కానీ, ఈ రోగి మాత్రం ఎంచక్కా నడిచి రావడమే కాకుండా, ఆపరేషన్ థియేటర్‌కు వెళుతూ డాన్స్ చేసింది. దీనికి వైద్యులు, వైద్య సిబ్బంది కూడా తోడుకావడంతో అక్కడ కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా, ఈ వీడియోను లక్ష మందికి పైగా నెటిజిన్లు తిలకించడం గమనార్హం. ఆ వీడియో మీ కోసం..