మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!
ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ప్రస్తుతం హృద్రోగం ప్రాణాంతక వ్యాధిగా మారిపోయింది. అయితే, చాలా మంది గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలను మాత్రమే గుర్తించలేదన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల మేరకు.. ప్రతి యేటా 17.9 మిలియన్ల మంది వరకు గుండె జబ్బులతో మరణిస్తున్నారు. వీటిలో ప్రతి ఐదు మందిలో నలుగురు గుండెపోటు వల్లే సంభవిస్తాయి. చాలా మంది గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందని అనుకుంటారు. కానీ, వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
గుండెపోటు రావడానికి ముందు... ఛాతిలో నొప్పి, ఊపిరాడకపోవడం, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. గుండెపోటు రావడానికి 30 రోజుల ముందు ఛాతినొప్పి, బరువుగా అనిపించడం, వేగవంతమైన హృదయస్పందన, శ్వాస ఆడకపోవడం, గుండెల్లో మంట, అలసట, నిద్ర సమస్యలు కనిపిస్తాయి. డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం మేరకు ఈ గుండెపోటు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి.