మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (12:14 IST)

తేనెలో నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే..?

తేనె అంటే నచ్చని వారుండరు. ప్రతిరోజూ తేనెను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. స్వచ్ఛమైన తేనె మంచి సువాసనను వెదజల్లుతుంది. తేనె తరచుగా ఆహారంలో భాగంగా చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.

తేనె అంటే నచ్చని వారుండరు. ప్రతిరోజూ తేనెను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. స్వచ్ఛమైన తేనె మంచి సువాసనను వెదజల్లుతుంది. తేనె తరచుగా ఆహారంలో భాగంగా చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ తేనె వేడిని చూపిస్తే కరిగిపోతుంది. చలికాలంలో చిక్కదనాన్ని పొందుతుంది.
  
 
శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది. అల్లం రసంతో కొద్దిగా తేనెను కలుపుకుని తీసుకుంటే శ్వాసకోశ వ్యాధికి మంచి ఉపశమనం కలుగుతుంది. ఎక్కుళ్ళు ఎక్కువగా వస్తున్నప్పుడు కొద్దిగా తేనెను తీసుకుంటే మంచిది. పాలలో చక్కెరకు బదులుగా కొద్దిగా తేనెను కలిపి సేవిస్తే బలహీనంగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు. పొడిదగ్గున్నవారు తేనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
 
అలానే ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందుగా సేవిస్తే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. తేనెను పాలలో లేదా టీలో కలుపుకుని తీసుకోవడం వలన కడుపులోని మంటను తగ్గిస్తుంది. తద్వారా అల్సర్ వ్యాధి దరిచేరదు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుటలో తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది.