గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2024 (20:19 IST)

Black Moon: డిసెంబర్ 31, 2024.. బ్లాక్ మూన్‌ని చూడొచ్చు.. ఎలాగంటే?

Black Moon
Black Moon
దేశంలో బ్లాక్ మూన్‌ని గుర్తించే సమయం ఆసన్నమైంది. ఇది 'వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్' అని పిలువబడుతోంది. ఇది రాబోయే రెండు రోజుల్లో హైదరాబాదీ ఆకాశంలో చల్లగా కనిపిస్తుంది. అవును ఇది బ్లాక్ మూన్ చాలా అరుదు. సాధారణంగా, ఒకే క్యాలెండర్ నెలలో రెండు అమావాస్యలు వస్తాయి. రెండవ అమావాస్యని బ్లాక్ మూన్ అంటారు. అలాగే, ఒకే నెలలో రెండు పౌర్ణమిలు సంభవించినట్లయితే, రెండవ చంద్రుడిని బ్లూ మూన్ అంటారని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఎస్ఐ) వ్యవస్థాపక కార్యదర్శి రఘునందన్ కుమార్ వివరించారు.
 
డిసెంబర్ 2024 నెలలో రెండు అమావాస్యలు (అమావాస్య) ఉన్నాయి, అంటే డిసెంబర్ 1, 2024న అలాగే డిసెంబర్ 31, 2024న రెండో అమావాస్య వస్తోంది. సుమారుగా, ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి, రెండు అమావాస్యలతో ఒక నెల ఉంటుంది. రెండవ అమావాస్యను తరచుగా బ్లాక్ మూన్ అని పిలుస్తారు. ఈ బ్లాక్ మూన్ డిసెంబర్ 31న కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
బ్లాక్ మూన్‌ సంభవించినప్పుడు చంద్రుడు కనిపించడు. కానీ దీని ప్రభావం ఆకాశంలో కనిపిస్తుంది. చంద్రునిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. చీకటి ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ కాంతిలోనే మనం నక్షత్రాలు, గ్రహాలు ఆఖరికీ గెలాక్సీలను కూడా స్పష్టంగా చూడవచ్చు. బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ సాయంతో జ్యూపిటర్ (గురుడు), వీనస్ (శుక్రుడు) లాంటి గ్రహాలను చూడొచ్చు. ఇక డిసెంబర్ 31న యూరప్, ఆఫ్రికా, ఆసియాలో ఉండేవారికి ఇది కనిపిస్తుంది. మనదేశంలో ఈ బ్లాక్‌ మూన్‌ను డిసెంబర్ 31న ఉదయం 3.57 గంటలకు చూడవచ్చు.