ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 2 మార్చి 2019 (22:34 IST)

యూకలిప్టస్ ఆయిల్ అలా మర్దన చేసుకుంటే?

ప్రకృతి మనకు అనేక రకములైన మూలికలను ఔషదాలుగా సహజసిద్దంగా ప్రసాదించింది. సాధారణంగా మనం ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వేసుకుంటాము. కానీ ఆ అలవాటు మంచిది కాదు. దానివల్ల మన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా చిన్న చిన్న సమస్యలకు మనకు సహజసిద్దంగా లభించే వాటితో ఆ సమస్యను నివారించుకోవచ్చు. అలా ఉపయోగపడే వాటిల్లో యూకలిప్టస్ ఒకటి. అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఎలాగో తెలుసుకుందాం.
 
1. యూకలిప్టస్‌ ఆయిల్‌‌తో శరీరాన్ని మర్ధన చేయించుకుంటే శరీరాన్ని చల్లబరచి, వేడిమి ఎక్కువ కాకుండా చూస్తుంది.
 
2. అనేక రకాల బాక్టీరియాలను సంహరించటంలో ప్రత్యేకత చూపే ఈ ఆయిల్‌ వల్ల శరీరం తాజా దనాన్ని సంతరించుకోవటంతో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది.
 
3. ఇది సహజసిద్దంగా మంచి సువాసనలు కలిగినది కావటంతో చర్మంపై వచ్చే పుళ్లు, యోని సంబంధిత దురద వ్యాధులకు ఉపయోగ పడుతుంది.
 
4. ఒళ్లు నొప్పులతో బాధపడేవారు బకేట్‌ వేడి నీళ్లలో రెండు కప్పుల యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి స్నానం చేస్తే... కీళ్ల నొప్పులు, శారీరక నొప్పులు కనుమరుగై హాయిగా నిద్ర పడుతుంది. భుజాలు, వీపు భాగాలలో యూకలిప్టస్‌ ఆయిల్‌కి కొద్దిగా విటమిన్‌ ఇని కలిపి మర్ధన చేస్తే ఫలితాలుంటాయి.
 
5. చర్మంపై మచ్చలు ఉండే వారు వాటిపై ఈ నూనెను రాస్తే... మచ్చలు పోవటంతో పాటు చర్మం కొత్త నిగారింపులు సంతరించుకుంటుంది.
 
6. పురుషులు ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌గానూ దీనిని వాడుకొంటే ముఖంపై పడే గాట్లు నుండి రక్షణ పొందటమే కాకుండా ముఖం కొత్త అందాలు సంతరించుకుంటుంది.
 
7. శనగపిండిలో కొద్దిగా యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి శరీరానికి నలుగు పెట్టుకుంటే శరీరం పొడిబారకుండా ఉండటమే కాకుండా మెత్తగా, అందంగా తయారవుతుంది.