గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By జె
Last Modified: శనివారం, 2 మార్చి 2019 (22:13 IST)

నెలకు అన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే ఆ వ్యాధులు రావట..?

మానవుడు శృంగారంలో పాల్గొనడం వల్ల శారీరకంగా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని బోలెడన్ని అధ్యయనాలు, పరిశోధనలు చెబుతూనే ఉన్నాయి. స్త్రీపురుషుల శృంగారం కేవలం శారీరక, మానసిక ఆనందమే కాకుండా ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఈ క్రమంలో శృంగారం కొన్ని రకాల క్యాన్సర్లను దూరం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలో నెలకు 21 సార్లు శృంగారంలో పాల్గొన్న పురుషుడికి ప్రొస్టెట్ క్యాన్సర్ రాదట. శృంగారంతో అంటే భాగస్వామితో కలవడమే కాదట స్వయంతృప్తితో కూడా ఇంతే ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
స్వయంతృప్తిని, అపరాధ భావనతో తప్పుగా చూడాల్సిన అవసరం లేదని పరిశోధకులు పేర్కొంటున్నారు. దానివల్ల శారీరక, లైంగిక సమస్యలు ఏవీ తలెత్తవని వారు చెబుతున్నారు. అయితే ఏదైనా మరీ శృతి మించకూడదని చెబుతున్నారు. నెలకు కనీసం 21 సార్లు శృంగారంలో పాల్గొంటే మంచిదని సూచిస్తున్నారు.