శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 15 జూన్ 2017 (22:26 IST)

బహుబాగా నిద్రపోవాలా...? ఈ పదార్థాలు తీసుకోండి...

ఆహారం తీసుకున్న వెంటనే హాయిగా నిద్రొచ్చేస్తుందని కొందరంటుంటారు. దీనికి కారణం కొన్ని ఆహార పదార్థాల్లో మస్త్‌గా నిద్రపుచ్చే గుణాలతో కూడిన విటమిన్లు ఉంటాయట. ముఖ్యంగా కొన్ని రకాలైన చేపలు, బీన్స్, పెరుగు, ఆకుకూరలను ఆహారంతో కలిపి తీసుకోవడం ద్వారా మాంచిగా న

ఆహారం తీసుకున్న వెంటనే హాయిగా నిద్రొచ్చేస్తుందని కొందరంటుంటారు. దీనికి కారణం కొన్ని ఆహార పదార్థాల్లో మస్త్‌గా నిద్రపుచ్చే గుణాలతో కూడిన విటమిన్లు ఉంటాయట. ముఖ్యంగా కొన్ని రకాలైన చేపలు, బీన్స్, పెరుగు, ఆకుకూరలను ఆహారంతో కలిపి తీసుకోవడం ద్వారా మాంచిగా నిద్ర వచ్చేస్తుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు. 
 
బీన్స్ వగైరాలలో ముఖ్యంగా బఠానీలు, చిక్కుడు కాయల్లో బి6, బి12, బి విటమిన్లు ఉంటాయి. అలాగే ఫోలిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు నిద్రొచ్చేలా పనిచేస్తాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారికి బి విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
అలాగే ఫాట్‌లెస్ పెరుగులో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఈ రెండు నిద్ర వచ్చేలా చేయడంలో పనిచేస్తాయి. పెరుగులోని కాల్షియం, మెగ్నీషియంల ప్రభావంతో అత్యంత వేగంగా నిద్రలోకి జారుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆకుకూరల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు ఆకుకూరలను రెండు రోజులకోసారి ఆహారంతో కలిపి తీసుకోవాలి.