మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (16:23 IST)

గోబీ పువ్వుతో.. డయాబెటిస్ చెక్..?

కాలిఫ్లవర్‌ను గోబీ పువ్వు అని పిలుస్తారు. కాలిఫ్లవర్‌తో పకోడీలు రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. దీనిని వాడేముందుగా వేడినీళ్ళల్లో గోబీ పువ్వును కడుక్కుంటే దానిలో గల పురుగులు నశించిపోతాయి. దీనిని తరచుగా ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన పలు రకాల క్యాన్యర్ వ్యాధ

కాలిఫ్లవర్‌ను గోబీ పువ్వు అని పిలుస్తారు. కాలిఫ్లవర్‌తో పకోడీలు రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. దీనిని వాడేముందుగా వేడినీళ్ళల్లో గోబీ పువ్వును కడుక్కుంటే దానిలో గల పురుగులు నశించిపోతాయి. దీనిని తరచుగా ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన పలు రకాల క్యాన్యర్ వ్యాధులను నివారించవచ్చును. అంతేకాకుండా హార్మోన్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
 
చర్మం గాయాలుగా, మంటగా ఉంటే ఈ కాలిఫ్లవర్‌ను మెత్తని పేస్ట్‌లా చేసుకుని ఆ ప్రాంతాల్లో పెట్టుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా చిన్నారులకు జ్ఞాపకశక్తిని పెంచుటకు సహాయపడుతుంది. కంటి చూపుని మెరుగుపరచుటకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఇది తీసుకుంటే శరీరంలోని విషాలను, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. 
 
అధిక బరువును తగ్గిస్తుంది. గుండె వ్యాధులు ఉన్నవారు నిర్భయంగా దీనిని తీసుకోవచ్చును. స్థూలకాయం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నియంత్రిస్తుంది. డయాబెటిస్, పక్షవాతం, మెదడు సంబంధిత వ్యాధులను సమర్థంగా నివారిస్తుంది.