శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (23:11 IST)

మునగ ఆకు రసంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తెలుసుకోవాల్సిందే

మరిగే నీటిలో గుప్పెడు మునగాకులు వేసి గట్టిగా మూతపెట్టి 5 నిమిషాలు ఉంచిన తరువాత ఆ పాత్రను చన్నీటిలో పెట్టి బాగా చల్లార్చి పాత్రలోని మునగాకు తీసివేసి మిగిలిన రసములో కొద్దిగా మిరియాలపొడి తగినంత ఉప్పు, 1 చెంచా నిమ్మరసం వేసి ప్రతిరోజూ ఉదయం సేవిస్తూ ఉంటే అజీర్తి, ఉబ్బసం, రక్తహీనత, మామూలు జలుబు, దగ్గు, నిస్సత్తువ వంటివి దరిచేరవు.
 
ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ప్రతిరోజూ పిల్లలకు తినిపిస్తుంటే పిల్లలు మంచి ఆరోగ్యముగా ఉండి చిన్నచిన్న వ్యాధులను లెక్కచేయకుండా చక్కగా ఆడుకుంటారు. వారి ఎముకలు గట్టిపడి పెరుగుదల బాగా ఉంటుంది.
 
ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటినుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక సుఖప్రసవం అవుతుంది.
 
బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్‌తో కలుపుకుని తాగితే మూత్రవిసర్జనలో మంట, కొన్ని మూత్రపిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గుతుంది.
 
ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుతూ వున్నట్లయితే రేచీకటి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధముగా పనిచేస్తుంది.
 
మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరినీటిలో ఒక చెంచా రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు కలుగుతాయి.