Webdunia - Bharat's app for daily news and videos

Install App

వానాకాలం జలుబును వదలగొట్టాలంటే ఇలా చేయాలి...

Written By సిహెచ్
Updated: మంగళవారం, 24 ఆగస్టు 2021 (23:43 IST)
ఒక అర చెంచా అల్లం రసంలో ఒక చెంచా తేనె కలుపుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దానివల్ల కలిగే ఆయాసం కూడా తగ్గిపోతుంది.
 
గోరువెచ్చని పాలల్లో కొద్దిగా యాలకుల పొడి, మిరియాల పొడి కలుపుకుని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే దగ్గు తగ్గి సుఖనిద్ర పడుతుంది. అలాగే మిరియాల కషాయం కూడా దగ్గుని తగ్గించడంలో సహాయపడుతుంది.
 
ఒక స్పూన్ తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫం వల్ల వచ్చే దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది. లేదా తులసి ఆకులను నమిలినా మంచి ఫలితం ఉంటుంది. 
 
శొంఠిని నీళ్లలో కలిపి కషాయంగా కాచి అందులో పటికబెల్లం కలుపుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. అలాగే శొంఠితో కాచే కాఫీ, టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
 
కరక్కాయను పగులగొట్టి చిన్న ముక్కను బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్దికొద్దిగా మింగుతూ ఉంటే సాధారణంగా వచ్చే దగ్గు తగ్గిపోతుంది. చేదుగా, వగరుగా ఉండే కరక్కాయ రసం మంచి ఫలితాన్నే ఇస్తుంది.
 
గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాలకుల పొడి, లవంగాల పొడి కలుపుకుని నెమ్మదిగా చప్పరిస్తూ తాగితే మంచి గుణం కనిపిస్తుంది.

అన్నీ చూడండి

ఫోన్ కోసం ఆత్మహత్య చేసుకోబోతున్న కొడుకుని కాపాడబోయి తల్లిదండ్రులు మృతి, వీడియో

సరైన పేపర్స్ లేకుండా బండిని నడుపుతున్న తండ్రిని పట్టిచ్చిన బుడతడు (video)

ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య మృతదేహం లభ్యం..

బెంగళూరు.. కారులో రూ.9 కోట్ల నగదు స్వాధీనం.. అంత డబ్బు ఎక్కడిది?

బొద్దింక జనులను ఎగేసుకున్న స్థానిక జనం, బురదలో పడేసి కుమ్మేసారు, వీడియో

అన్నీ చూడండి

Tanikella Bharani: ప్రేమతో తీసిన ‘ప్రేమనే ఊరిలో అందరూ చూడాలని కోరుకుంటున్నా- తణికెళ్ల భరణి

Pawan Kalyan Kerala tour : ఆయుర్వేద థెరపీ కోసం కేరళం వెళుతున్న పవన్ కళ్యాణ్

Chiru, pawan: షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది

చిరంజీవి బర్త్ డే టిబ్యూట్ గా పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ లో మెగా సాంగ్ రిలీజ్

Radhika Sarathkumar: ;జై బాలయ్య అనే లుక్ తో రాదికా శరత్‌కుమార్ 64వ పుట్టినరోజు పోస్టర్

తర్వాతి కథనం
Show comments