Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అబ్బా మెడనొప్పి... వదిలించుకునేందుకు చిట్కాలు

మెడనొప్పికి రకరకాల కారణాలుంటాయి. ఉదాహరణకు పడుకుని టీవీ చూడటం, ఎక్కువసేపు డెస్క్ వర్క్ లేదా చదవడం- రాయడం, జోరుగా మెడను ఆడించి తిప్పడం, తల దిండు సరిగా లేకపోవడం లాంటివి. మెడనొప్పికి సాధారణంగా ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. మరీ ఎక్కువైతే తప్ప వైద్యుడిని స

Written By ivr
Updated: శనివారం, 15 సెప్టెంబరు 2018 (13:01 IST)
మెడనొప్పికి రకరకాల కారణాలుంటాయి. ఉదాహరణకు పడుకుని టీవీ చూడటం, ఎక్కువసేపు డెస్క్ వర్క్ లేదా చదవడం- రాయడం, జోరుగా మెడను ఆడించి తిప్పడం, తల దిండు సరిగా లేకపోవడం లాంటివి. మెడనొప్పికి సాధారణంగా ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. మరీ ఎక్కువైతే తప్ప వైద్యుడిని సంప్రదించండి. ఈ నొప్పిని ప్రాథమికంగా చికిత్స చేసుకునేందుకు తగిన సూచనలు మీకోసం...
 
1. మీ మెడను మెల్లగా గడియారంలోని లోలకంలా ఐదుసార్లు తిప్పండి. మళ్ళీ తలను కిందికి పైకి, కుడివైపుకు, ఎడమవైపుకు తిప్పండి. నొప్పిగా ఉంటే నిదానంగా చేయండి. 
 
2. ఏదైనా నూనెను నొప్పి ఉన్న చోట పూయండి. ఆ తర్వాత మాలిష్ చేయండి లేదా సుతిమెత్తగా మాలిష్ చేయించుకోండి. మాలిష్ చేసేటప్పుడు పైనుంచి క్రింది వైపుకు చేయండి. అంటే మెడ పైనుంచి భుజాలవైపుకు మాలిష్ చేస్తుంటే తగ్గిపోతుంది. మాలిష్ చేసిన తర్వాత వేడి నీటితో కాపడం పెట్టండి. కాపడం పెట్టిన తర్వాత చల్లటి వాతావరణంలో తిరగకండి. అలాగే చల్లటి పానీయం త్రాగకండి.
 
3. మీరు టీవీ చూడాలనుకుంటే మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటుండండి. అలాగే చదువుకోవండ, రాయడం, డెస్క్ వర్క్ చేసే సందర్భంలో కాస్త విశ్రాంతి తీసుకుంటుండండి.
 
4. మీరు వాడే తలగడ సరైనదిగా ఉండేలా చూసుకోండి. 
 
5. ఇలా చేసినాకూడా మెడనొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల సలహాలు లేకుండా మెడ నొప్పి నివారణ మాత్రలు వాడకండి. ఇందులో ఫిజియోథెరపిస్ట్ సలహా మేరకు మాత్రమే మెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి.
About Author
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... Read More

అన్నీ చూడండి

స్థానిక ఎన్నికల్లో 100 శాతం విజయమే లక్ష్యం: చంద్రబాబు, పవన్‌‌ల కసరత్తు

Chandra Babu Naidu: మెట్రో రైలు ప్రాజెక్ట్, బీచ్ కారిడార్‌‌లకు ఆమోదం.. ఢిల్లీకి చంద్రబాబు

వాళ్లేమీ సంఘ విద్రోహ శక్తులు కాదు : బాంబే హైకోర్టు

బేగంపేట.. ఎనిమిదేళ్ల కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రిపై పోక్సో చట్టం నమోదు

మా లాయర్లలో మంచి నటులున్నారు... వారితో సినిమాలు చేయండి : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా

Balakrishna: బాలయ్యతో మళ్లీ జతకట్టనున్న విజయశాంతి?

Master Arun: సమ్మర్ హాలిడేస్ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్

కన్నడలో యష్‌ తో చేయాల్సింది - బాబీ నన్ను ఎంకరేజ్ చేశారు : డైరెక్టర్ జనకిరామ్ మారెళ్ల

Teja Sajja: ది ట్రెయిటర్స్ గేమ్ మిస్టరీ గా ఉంటుంది, జాంబీ రెడ్డి 2 చిత్రీకరిస్తున్నాం తేజ సజ్జ

తర్వాతి కథనం
Show comments