ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 15 సెప్టెంబరు 2018 (14:49 IST)

ఎలాంటి ఆహార పదార్థాలను కొనాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మనం తీసుకునే ఆహారం ఎంత పుష్టికరమైనదైనా శుభ్రత లోపిస్తే ఆరోగ్యం దెబ్బతిని రోగాలకు గురి అవుతాము. మనం తినే ఆహారం, త్రాగే నీరు సూక్ష్మక్రిముల వల్ల కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అలాకాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

మనం తీసుకునే ఆహారం ఎంత పుష్టికరమైనదైనా శుభ్రత లోపిస్తే ఆరోగ్యం దెబ్బతిని రోగాలకు గురి అవుతాము. మనం తినే ఆహారం, త్రాగే నీరు సూక్ష్మక్రిముల వల్ల కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అలాకాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
 
1. ఆహారపదార్థాలను కొనేటప్పుడు ఎక్కువ శ్రద్ధ వహించి యోగ్యమైన వాటినే కొనాలి. మెత్తబడిన, పగిలిన కూరగాయలు, పండ్లు కొనగూడదు.
 
2. ఆహారపదార్థాలను గాలి, వెలుతురు తగిలే చోట, తేమ తగలకుండా నిలువ చేయాలి. అలాగే వండే ముందు పండ్లు, కూరగాయలను ఎక్కువ నీటిలో శుభ్రంగా కడగాలి.
 
3. వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా వంటకు శుభ్రమైన నీటిని వాడాలి. 
 
4. మనం త్రాగే నీరు కాచి చల్లార్చి, వడబోసి తాగడం శ్రేయస్కరం.
 
5. వండిన పదార్థాలపై ఎప్పుడూ మూత వేసి ఉంచాలి. లేకపోతే క్రిములు చేరి కలుషితం చేస్తాయి.
 
6. వంట ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే శరీర శుభ్రత కూడా చాలా అవసరం. వంట చేసే ముందు, వడ్డించే ముందు అలాగే తినబోయే ముందు కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
 
7. ముఖ్యంగా చిన్నపిల్లల ఆహార విషయంలో శుచి, శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పాలు పట్టడానికి వాడే సీసాలు, పీకలను చాలా శుభ్రంగా కడిగి వేడి నీటిలో మరగబెట్టి వాడాలి.
 
8. ఆహారం పరిశుభ్రత లోపిస్తే రోగాలకు గురి అవడమే కాకుండా కొన్ని సందర్భాలలో మరణానికి కూడా దారి తీయవచ్చు. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.