శనివారం, 2 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (22:57 IST)

రెడ్ రైస్ తింటే ఏమవుతుంది?

Red Rice
ఎర్ర బియ్యం- రెడ్ రైస్‌. ఈ బియ్యంలో ఆంథోసైనిన్‌ల వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎర్ర బియ్యం వినియోగం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము.
 
ఎర్ర బియ్యం తినడం వల్ల శరీరంలోని కణాలపై మంచి ప్రభావం చూపి ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎర్రటి బియ్యం లోపల యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఈ బియ్యంలో మాంగనీస్ లభిస్తుంది.
ఎర్ర బియ్యం తినడం వల్ల రక్తహీనత తగ్గి శరీరంలో రక్త స్థాయి పెరుగుతుంది.
సాధారణ ఎర్ర బియ్యంలో ఐరన్ ఉండటంతో అది రక్తాన్ని పెంచడానికి పనిచేస్తుంది.
ఎర్ర బియ్యం తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం.
రెడ్ రైస్ తినడం వల్ల చక్కెర స్థాయి పెరగదు.
ఎర్రటి అన్నం తినడం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.