బుధవారం, 11 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 17 ఏప్రియల్ 2023 (23:24 IST)

సుగంధ కోకిల నూనెతో ప్రయోజనాలు, ఏంటవి?

Beauty
సుగంధ కోకిల ఎండిన బెర్రీల నుండి తీసిన నూనెను ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ నూనె ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది. ఇందులో వున్న ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సుగంధ కోకిల కేంద్ర నాడీ వ్యవస్థకు సహజమైన టానిక్‌గా పనిచేస్తుంది.
 
సుగంధ కోకిల మనస్సుకు విశ్రాంతినిచ్చి, ఒత్తిడి- ఆందోళన నుండి ఉపశమనం అందిస్తుంది. సుగంధ కోకిల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న కారణంగా శరీరంలో వాపు, నొప్పి చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది.
 
సుగంధ కోకిల నూనె జీర్ణవ్యవస్థకు అద్భుతమైన టానిక్. సుగంధ కోకిల యాంటిసెప్టిక్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో నిండి ఉంది. చర్మం, జుట్టుకు సుగంధ కోకిల నూనె మేలు చేస్తుంది. ఈ నూనెను ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ రంధ్రాల నుంచి మురికి తొలగిపోయి మొటిమలు తగ్గుతాయి.